newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

27-11-202027-11-2020 20:14:15 IST
Updated On 28-11-2020 07:47:39 ISTUpdated On 28-11-20202020-11-27T14:44:15.711Z27-11-2020 2020-11-27T14:43:54.628Z - 2020-11-28T02:17:39.634Z - 28-11-2020

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. ఈ పాట వింటే ఒకప్పుడు అల్లు అర్జున్ గుర్తుకు వచ్చేవాడు. ఎప్పుడైతే లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుండి డేవిడ్ వార్నర్ గుర్తుకు వస్తున్నాడు. లాక్ డౌన్ లో తన భార్యతో కలిసి స్టెప్ వేసి అలరించాడు వార్నర్. ఐపీఎల్ సమయంలో కూడా వార్నర్ బుట్టబొమ్మ పాటకు స్టెప్ వేశాడు. సన్ రైజర్స్ పార్టీ చేసుకుంటున్న సమయంలో కూడా వార్నర్ స్టెప్ తో అలరించాడు. ఇక ఇన్నాళ్లు మనం వార్నర్ వేసిన బుట్టబొమ్మను చూసి ఎంజాయ్ చేస్తే.. తాజాగా వార్నర్ మాత్రమే ఎంజాయ్ చేస్తూ బుట్టబొమ్మ స్టెప్ వేసుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వార్నర్ ఆస్ట్రేలియా విజయం ముంగిట ఉన్న సమయంలో వార్నర్ బుట్టబొమ్మ స్టెప్ వేశాడు. సిడ్నీ, కాన్‌బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని అనుమతించారు. సిడ్నీలో మొదటి మ్యాచ్‌ జరుగుతుండగా అభిమానులు డేవిడ్‌ వార్నర్‌ను ఉద్దేశించి వన్స్‌మోర్‌ వార్నర్‌ బుట్టబొమ్మ అంటూ కేకలు వేశారు. ఇక మనోడు అప్పటికే మంచి ఇన్నింగ్స్ ఆడి ఉన్నాడు.. ఆస్ట్రేలియా కూడా మ్యాచ్ లో మంచి పొజిషన్ లో ఉండడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ట్రేడ్ మార్క్ బుట్టబొమ్మ స్టెప్ వేసేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది.  

ఆస్ట్రేలియా నిర్ధేశించిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 76 బంతులాడిన పాండ్య 7 ఫోర్లు, 4 సిక్సులతో అలరించాడు. ధావన్ (74) పరుగులతో రాణించాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజెల్ వుడ్ టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీశాడు. హేజెల్ వుడ్ ధాటికి మయాంక్ అగర్వాల్ (22), కెప్టెన్ విరాట్ కోహ్లీ (21), శ్రేయాస్ అయ్యర్ (2) పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114),  స్టీవ్ స్మిత్ (105) సెంచరీలతో ఆకట్టుకున్నారు. 66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు బాదిన స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.   

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   2 hours ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   5 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   9 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   6 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle