newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!

08-04-202108-04-2021 09:37:30 IST
2021-04-08T04:07:30.045Z08-04-2021 2021-04-08T02:19:53.749Z - - 11-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇంకొన్ని గంటల్లో ఐపీఎల్ సంగ్రామం మొదలు కాబోతోంది. ఇప్పుడు కూడా కరోనా మహమ్మారి ఆటగాళ్లను వెంటాడుతూ ఉంది. మ‌రో స్టార్ ఆట‌గాడు క‌రోనా బారిన ప‌డ్డాడు. ఆల్‌రౌండ‌ర్ డేనియెల్ సామ్స్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ సీజ‌న్‌లో అత‌డు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని.. హోట‌ల్ రూమ్‌లో క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు బెంగ‌ళూరు ట్వీట్ చేసింది. డేనియెల్‌కు ఏప్రిల్ 3న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రావడంతో అత‌డు బెంగ‌ళూరు శిబిరంలో చేరాడు. తాజాగా చేసిన ప‌రీక్ష‌ల్లో అత‌డికి పాజిటివ్ వ‌చ్చింది. అతడిలో కరోనా లక్షణాలు ఏవీ లేవని, ఐసోలేషన్‌లో ఉన్నాడని ఆర్సీబీ చెప్పింది. బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం వైద్య బృందం డేనియల్ ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌, ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కీపింగ్‌ సలహాదారు కిరణ్‌ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మోరేకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, నిబంధనల ప్రకారం ఆయనను ఐసోలేషన్‌కు తరలించారు. జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్‌లోనే కిరణ్‌ మోరే కూడా ఉండటంతో తొలుత ముంబై యాజమాన్యం ఆందోళన చెందింది. తమ జట్టు ఆటగాళ్లు, సహయ సిబ్బందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటివ్‌ రావడంతో ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కిరణ్‌ మోరేకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ, మంగళవారం ట్రైనింగ్‌ సెషన్‌ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది. అయితే కోవిడ్‌ పరీక్షల్లో అందరికీ నెగిటివ్‌ రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఏప్రిల్‌ 9న జరుగనున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఢీకొం‍టుంది. కరోనా మహమ్మారి ఐపీఎల్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. టోర్నీ మధ్యలో ఇంకెంత మంది క్రికెటర్లు కరోనా బారిన పడతారోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle