newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

11-04-202111-04-2021 07:15:11 IST
2021-04-11T01:45:11.369Z11-04-2021 2021-04-11T01:43:40.165Z - - 15-05-2021

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ను ఓటమితో మొదలుపెట్టింది. భారీ స్కోరును చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మాత్రం తడబడలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా అద్భుతంగా ఆడి చెన్నై కు ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ లో పొరపాట్లు కూడా ఢిల్లీకి కలిసొచ్చాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 

ముంబైలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీ సేన, 188 పరుగులు చేసింది. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా దూకుడు కనబరిచి, 36 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (54), శామ్ కరన్ (34) రాణించారు. మొదట చెన్నై 7 పరుగులకే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), డుప్లెసిస్ (0) వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సురేశ్ రైనా, మొయిన్ అలీ (36) జోడీ వికెట్ల పతనాన్ని ఆపడమే కాకుండా మంచి రన్ రేట్ ను కొనసాగించారు. అంబటి రాయుడు (23), రవీంద్ర జడేజా (26) కూడా వేగంగా పరుగులు సాధించారు.  చెన్నై 137 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా శామ్ కరన్ ధాటిగా ఆడడంతో చెన్నై భారీస్కోరు సాధించింది. 15 బంతులు ఎదుర్కొన్న శామ్ కరన్ 4 ఫోర్లు, 2 భారీ సిక్సులతో అలరించాడు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, టామ్ కరన్ లకు చెరో వికెట్ లభించింది.

 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ధావన్ 54 బంతుల్లో 85, పృధ్వీ షా 38 బంతుల్లో 72 పరుగులు చేయడంతో విజయం దాదాపుగా ఢిల్లీదే అన్నట్లు తయారైంది. మిగతా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే లాంఛనాన్ని పూర్తి చేశారు. చివర్లో పంత్, (15 పరుగులు) స్టోయినిస్ (14 పరుగులు)లు జట్టును విజయ తీరాలకు చేర్చారు. శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నేడు చెన్నై వేదికగా, రాత్రి 7.30 గంటల నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle