newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

భారత ఆటతీరుకు ఫిదా అవుతున్న క్రికెట్ లెజెండ్స్

17-01-202117-01-2021 23:36:28 IST
Updated On 18-01-2021 07:55:06 ISTUpdated On 18-01-20212021-01-17T18:06:28.738Z17-01-2021 2021-01-17T18:06:26.040Z - 2021-01-18T02:25:06.623Z - 18-01-2021

భారత ఆటతీరుకు ఫిదా అవుతున్న క్రికెట్ లెజెండ్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత జట్టు ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్లినప్పటి నుండి ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరిగా భారత ఆటగాళ్లు సిరీస్ నుండి వైదొలుగుతూ వచ్చారు. విరాట్ కోహ్లీ పితృత్వపు సెలవుతో తొలి టెస్టు అనంతరం జట్టు నుంచి తప్పుకోగా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ముఖ్యంగా ఏ మాత్రం అనుభవం లేని బౌలింగ్ లైనప్ తో భారత్ ఆస్ట్రేలియా గడ్డ మీద ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో తలపడుతూ ఉంది.

అయితే భారత్ పోరాడుతూ ఉన్న తీరును పలువురు క్రికెట్ లెజెండ్స్ ప్రశంసిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా భారత్ కు క్షమాపణలు చెప్పాడు. మొదటి టెస్ట్ ఓడిపోయాక, కోహ్లీ జట్టు నుండి వెళ్ళిపోయాక భారత్ ఈ సిరీస్ ను 4-0 తో కోల్పోతుంది అని జోస్యం చెప్పాడు. కానీ మూడు టెస్ట్ మ్యాచ్ లు ముగిశాక భారత్ 1-1తో సమంగా నిలిచింది. దీంతో వాన్ తన జోస్యం తప్పని.. భారత్ ను తక్కువగా అంచనా వేసినందుకు క్షమించాలని కోరాడు.    

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా భారత్ ఆటతీరుకు ఫిదా అయిపోయాడు. టెస్టు సిరీస్ లో పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగిన ఆసీస్ ను కొత్త ఆటగాళ్లతో కూడిన భారత్ అత్యంత పోరాటపటిమతో ఎదుర్కొంటోందని ప్రశంసించాడు. భారతజట్టు బెంచ్ ఎంతో పటిష్టమని చెప్పాడు అక్తర్. "ఎంతోమంది ఆటగాళ్లు జట్టుకు దూరమైనా, సుందర్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్ వంటి చిన్నవాళ్లతో టీమిండియా పోరు కొనసాగిస్తోంది. ఈ పసి ఆటగాళ్లు తాము ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్ ఆడతామని కలలో కూడా అనుకుని ఉండరు.

కానీ ఇది వాస్తవరూపం దాల్చింది. ఒకవేళ ఈ సిరీస్ లో టీమిండియా తన ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లో విజయం సాధిస్తే అది భారత క్రికెట్ చరిత్రలోనే పెద్ద విజయం అవుతుంది" అని అక్తర్ అభిప్రాయపడ్డాడు. "జస్ప్రీత్ బుమ్రా లేడు, ప్రధాన బ్యాట్స్ మెన్ లేరు. చివరి టెస్టుకు వచ్చేసరికి ప్రధాన జట్టు అంతా వైదొలిగింది. కానీ ఈ కుర్రాళ్లతో కూడిన జట్టు ప్రదర్శిస్తున్న స్ఫూర్తి అమోఘం. పూర్తి స్థాయి పేస్ బలంతో బరిలో దిగిన ఆసీస్ ను నిలువరిస్తున్న తీరు అభినందనీయం. ఆసీస్ టీమ్ తో పోలిస్తే ప్రస్తుతం టీమిండియాలో ఆడుతున్న యువ ఆటగాళ్లు ఏమంత అనుభవజ్ఞులు కాదు. కానీ ఓ జట్టుగా వారి వైఖరి అందరినీ ఆకట్టుకుంటోంది"  అని వివరించాడు.

బ్రిస్బేన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 20 పరుగులు చేయగా, మరో ఓపెనర్ మార్కస్ హారిస్ 14 బంతులాడి 1 పరుగు సాధించాడు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 54 పరుగులకు చేరింది. 

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్

   16 hours ago


మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం

   17 hours ago


5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్

   20 hours ago


సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!

   21 hours ago


పంత్  సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!

   05-03-2021


205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

   04-03-2021


హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

   04-03-2021


మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

   03-03-2021


నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

   03-03-2021


అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

   02-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle