newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్.. ఐపీఎల్ కోసమేనా..!

05-04-202105-04-2021 00:15:14 IST
2021-04-04T18:45:14.460Z04-04-2021 2021-04-04T14:58:55.266Z - - 11-04-2021

క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్.. ఐపీఎల్ కోసమేనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ 14వ సీజన్ వచ్చే శుక్రవారం నుండి మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ క్యాష్ రిచ్ టోర్నమెంట్ ను కరోనా మహమ్మారి వెంటాడుతూ ఉంది. ఇప్పటికే ఆటగాళ్లతో పాటూ పలువురు సిబ్బందికి కూడా కరోనా సోకింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్ వేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు వ్యాక్సినేష‌న్ అంశంపై తాము ఆలోచ‌న చేస్తున్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు. తాము ఆరోగ్యశాఖ‌తో సంప్ర‌దిస్తున్నామ‌ని, ఆట‌గాళ్ల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని అడుగుతున్న‌ట్లు చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్ కోసం అన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కేవ‌లం ఆరు వేదిక‌ల్లోనే ఐపీఎల్ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఆ దిశ‌గా బ‌యో బ‌బుల్ ఏర్పాటు చేశామ‌ని శుక్లా చెప్పారు. టీమ్స్‌లో స‌భ్యుల సంఖ్య‌ను కూడా పెంచిన‌ట్లు తెలిపారు. ప్రేక్ష‌కులు లేకుండానే టోర్నీ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కరోనా వైరస్ ఎప్పుడు అంతరించిపోతుందో ఎవరికీ తెలియదని.. దీనికి ప్రత్యేకంగా డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోవడమేనని, అందరిలాగే క్రికెటర్లకు కూడా వ్యాక్సిన్లు ఇప్పిస్తామని వివరించారు. టోర్నీ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, ప్రత్యామ్నాయ వేదికలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

 పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారినపడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా వంటి ఆటగాళ్లు కరోనా బాధితుల జాబితాలో చేరారు. నితీశ్ రాణా ఇప్పటికే కోలుకున్నాడు. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఐపీఎల్ సజావుగా సాగుతుందా లేదా అనే భయాలు వెంటాడుతూ ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయిస్తే టోర్నమెంట్ కూడా ప్రశాంతంగా జరుగుతుందని బీసీసీఐ యోచిస్తూ ఉంది. కరోనా వ్యాక్సిన్లు భారత ఆటగాళ్లకు మాత్రమే వేస్తారా...? లేక ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లకు కూడా వేస్తారా అన్నది తెలియాల్సింది. ప్రస్తుతానికైతే భారత్ లో 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్లు వేస్తూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle