newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ ను కమ్మేస్తున్న కరోనా..!

04-04-202104-04-2021 14:24:42 IST
2021-04-04T08:54:42.694Z04-04-2021 2021-04-04T02:03:41.549Z - - 11-04-2021

ఐపీఎల్ ను కమ్మేస్తున్న కరోనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏప్రిల్ 9 నుండి ఐపీఎల్ సీజన్ 14 మొదలవుతోంది. సమ్మర్ లో హాయిగా క్రికెట్ ను చూస్తూ ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి ఐపీఎల్ మీద కూడా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అందుకే ఆటగాళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు నిర్వాహకులు. బయోబబుల్ లో కఠిన ఆంక్షలను విధించారు. ఇక ఈ ఏడాది సక్సెస్ ఫుల్ గా భారత్ లో ఐపీఎల్ నిర్వహించాలని అనుకుంటూ ఉండగా.. ఇంతలో ముంబై లోని  వాంఖడే స్టేడియం సిబ్బంది కరోనా బారినపడ్డారు. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు వస్తున్నది మహారాష్ట్రలోనే. అది కూడా ముంబయిలో.. ఇక వాంఖడే స్టేడియంలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఐపీఎల్ పోటీల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించిన ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన వారందరినీ ఇళ్లకు పంపించి వేసి, వారి స్థానంలో కొత్త సిబ్బందిని తీసుకున్నారు. ఆటగాళ్లందరూ బయో బబుల్ లో ఉన్నారని, పైగా ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నందున టోర్నీని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తామని బీసీసీఐ చెబుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతే హైదరాబాద్, ఇండోర్ నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. 

ఇక ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిర్వాహకులు షాక్ అవుతూ ఉన్నారు. కోల్ కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు నితీష్‌ రాణాకు కరోనా సోకగా.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకింది. అక్షర్‌కు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనే  విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. అక్షర్‌కు కరోనా  వైరస్‌ సోకిందని.. ఇది చాలా దురదృష్టకరమని ఐపీఎల్ ఫ్రాంచైజీ తెలిపింది.   ప్రొటోకాల్ ప్రకారం అక్షర్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు.  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నియమావళి ప్రకారం అక్షర్‌ పది రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అతనికి కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాతే జట్టుతో కలవనున్నాడు.  

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle