newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంకా అవకాశం ఉందట..!

24-10-202024-10-2020 11:56:07 IST
Updated On 24-10-2020 12:39:06 ISTUpdated On 24-10-20202020-10-24T06:26:07.390Z24-10-2020 2020-10-24T06:26:04.190Z - 2020-10-24T07:09:06.630Z - 24-10-2020

చెన్నై సూపర్ కింగ్స్ కు ఇంకా అవకాశం ఉందట..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారీ ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై ఆట చాలా దారుణంగా ఉంది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. చెన్నై ప్లే ఆఫ్ ఆశలు లేనట్లేనని చెబుతూ ఉన్నారు. కానీ ఇంకా అవకాశం అయితే ఉందని అంటున్నారు. ప్లే ఆఫ్ కు చెన్నై వెళ్లాలంటే చాలా సమీకరణాలే కలిసి రావాలని అంటూ ఉన్నారు.  ఆడిన 11 మ్యాచుల్లో మూడు మ్యాచులు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరే దారులు దాదాపుగా మూసుకుపోయినప్పటికీ కొన్ని గణాంకాల్లో మార్పులు వస్తే అవకాశాలుంటాయి. ఇక వచ్చే గేమ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై తలపడనుంది. ముఖ్యంగా మిగతా జట్ల ప్రదర్శనపైనే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. సూపర్ కింగ్స్ టాప్‌ 4కు చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లతో ఆడే మ్యాచుల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. ఇతర జట్ల కంటే మెరుగైన రన్‌రేట్‌‌తో ధోనీ సేన విజయం సాధించాల్సి ఉంటుంది.

ముంబై మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఆడే మిగతా మ్యాచుల్లో విజయం సాధించి 18 లేదా 22 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలవాలి. ఇక బెంగళూరు జట్టు మూడో స్థానంలో 16-20 పాయింట్లతో ఉండాలి. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయి సన్‌రైజర్స్‌పై గెలవాల్సి ఉంటుంది. ముంబై - బెంగళూరు, ఢిల్లీ -బెంగళూరు, ముంబై- ఢిల్లీల మధ్య జరిగే మ్యాచుల ఫలితాలతో చెన్నై జట్టుకు పని ఉండదు. ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉంటాయి.

రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టులు ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు జట్లు పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 7వ స్థానం, సన్‌రైజర్స్ జట్టు 5వ స్థానం, పంజాబ్ జట్టు 6వ స్థానంలో ఉన్నాయి. వీటన్నిటికీ 8 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కో మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లతో ఉంటాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఉండవు. కోల్‌కతా నైట్ రైడర్స్ మరో మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్ల వస్తాయి. ఇక ప్రస్తుతం కోల్‌కతాకు 10 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గి పంజాబ్ మరియు ఢిల్లీ జట్లపై ఓడితే ఐదవ స్థానానికికు కోల్‌కతా పరిమితమవుతుంది. అప్పుడు చెన్నై మంచి నెట్ రన్ రేట్ ఉంటే నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. చెన్నై నాలుగో స్థానంకు వెళ్లాలంటే ఇన్ని జరగాలా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

   5 hours ago


ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

   6 hours ago


బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

   24-11-2020


కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

   24-11-2020


టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..?  అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..? అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

   24-11-2020


ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

   24-11-2020


ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

   23-11-2020


మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

   23-11-2020


నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

   23-11-2020


ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

   21-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle