newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

ఈసారి మాకు కష్టమే.. ధోనీ

20-10-202020-10-2020 09:21:48 IST
Updated On 20-10-2020 09:57:44 ISTUpdated On 20-10-20202020-10-20T03:51:48.181Z20-10-2020 2020-10-20T03:51:46.503Z - 2020-10-20T04:27:44.586Z - 20-10-2020

ఈసారి మాకు కష్టమే.. ధోనీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీల్ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. ఈ దఫా ఐపీఎల్ టోర్నీలోనే అత్యంత చెత్తగా సాగిన సోమవారం నాటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ముందు తలవంచిన సీఎస్కే జట్టు తన ఐపీఎల్ చరిత్రలో మొదటి సారిగా ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. పరుగు తీయడమే కష్టంగా మారినట్లు, బౌండరీ బాదడం అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టాలేమో అన్నంత భారంగా చెన్నై బ్యాటింగ్‌ చేసింది. ఛేదనలో రాజస్తాన్‌ కూడా తడబడ్డా... స్మిత్, బట్లర్‌ భాగస్వామ్యంతో కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 బంతుల్లో అభేద్యంగా 98 పరుగులు జోడించి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.  

ఐపీఎల్‌లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్‌ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి ముందంజ వేయడంపై ఆశలు వదులుకోవాల్సిందే! సీజన్‌ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్‌ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ఎమ్మెస్‌ ధోని (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జాస్‌ బట్లర్‌ (48 బంతుల్లో 70 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (34 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు.  

అక్షరాలా సమిష్టి వైఫల్యమే..

సీఎస్కే జట్టుకు ఇది అక్షరాలా సమిష్టి వైఫల్యమే.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మరింత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై జట్టు బ్యాటింగ్‌ బలహీనత మరోసారి కనిపించింది. ఇన్నింగ్స్‌ మొత్తంలో 12 ఫోర్లు, 1 సిక్స్‌ మాత్రమే ఉండగా... భారీ షాట్లు ఆడే ప్రయత్నం కూడా బ్యాట్స్‌మెన్‌ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. పేరుకు ధోని, జడేజా మధ్య 51 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నా... అదీ 46 బంతుల్లో రావడం దూకుడులేమిని స్పష్టంగా చూపించింది. డు ప్లెసిస్‌ (10)ను తొందరగా అవుట్‌ చేసి రాజస్తాన్‌కు ఆర్చర్‌ శుభారంభం అందించాడు. యువ బౌలర్‌ త్యాగి తన తొలి ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చినా... అదే ఓవర్లో వాట్సన్‌ (8)ను వెనక్కి పంపించాడు. 

స్టోక్స్‌ వేసిన ఐదో ఓవర్లో చెన్నై 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 43 పరుగులకు చేరింది. ఆ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో స్యామ్‌ కరన్‌ (25 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌), రాయుడు (13) వెనుదిరిగారు. 10 ఓవర్లలో 56 పరుగులు చేసిన చెన్నై స్కోరు 15 ఓవర్లలో 89 పరుగులకు చేరింది. అనంతరం రెండో పరుగు తీసే ప్రయత్నంలో ధోని రనౌటయ్యాడు. జడేజా చలవతో ఆఖరి 5 ఓవర్లలో 3 ఫోర్లతో చెన్నై 36 పరుగులు జోడించగలిగింది.  

చెన్నై ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ చివరి బంతికి రాయుడు ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత జట్టు మరో బౌండరీ కోసం ఏకంగా 8.1 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. త్యాగి వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి త్యాగి ధోని మళ్లీ ఫోర్‌ కొట్టాడు. ఒక టి20 మ్యాచ్‌లో రెండు బౌండరీల మధ్య విరామం 49 బంతులు! రాజస్తాన్‌ ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లు శ్రేయస్‌ గోపాల్, రాహుల్‌ తేవటియా ఎంతో ప్రభావం చూపించారు. వీరిద్దరు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 8 ఓవర్లలో కలిపి 32 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశారు. పైగా ఒక్క ఫోర్‌ కూడా ఇవ్వకపోవడం విశేషం.

రాజస్తాన్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే పేలవ షాట్లతో స్టోక్స్‌ (19), ఉతప్ప (4), సామ్సన్‌ (0) వెనుదిరిగారు. ఈ దశ లో స్మిత్, బట్లర్‌ కూడా సమర్థంగా ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఛేదించాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో ఆడారు. బట్లర్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, స్మిత్‌ అతడికి సహకరించాడు. శార్దుల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్‌... చావ్లా ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈసారి మాకు కష్టమే.. ధోనీ నిర్వేదం

ఆట ముగిసిన తర్వాత సీఎస్కే జట్టు కెప్టెన్ ధోనీ నిర్వేదం ప్రకటించాడు. ఈ సీజన్‌లో మేం ఇక  ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4–5 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో అని చెప్పాడు ధోనీ.

ధోని@200

ఐపీఎల్‌లో ధోని 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్‌లు చెన్నై తరఫున ఆడగా... చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున మరో 30 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్‌లో ధోని మొత్తం 4,596 పరుగులు సాధించగా... తాజా మ్యాచ్‌తో ఒక్క సీఎస్‌కే తరఫునే ధోని ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు.

 

 

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

   5 hours ago


ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

   6 hours ago


బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

   24-11-2020


కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

   24-11-2020


టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..?  అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..? అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

   24-11-2020


ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

   24-11-2020


ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

   23-11-2020


మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

   23-11-2020


నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

   23-11-2020


ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

   21-11-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle