newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

27-02-202127-02-2021 17:09:26 IST
2021-02-27T11:39:26.962Z27-02-2021 2021-02-27T10:14:45.218Z - - 11-04-2021

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను భారతజట్టు నుండి పంపించింది బీసీసీఐ. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టుకు బుమ్రా వ్యక్తిగత కారణాలతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు జస్ప్రీత్ బుమ్రా విజ్ఞప్తికి బీసీసీఐ ఓకే చెప్పింది. బుమ్రా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడని ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల తనను మ్యాచ్ నుంచి మినహాయించాల్సిందిగా బుమ్రా కోరాడని.. దీంతో బుమ్రాకు విశ్రాంతినిచ్చామని, అతడి స్థానంలో కొత్తగా ఎవరినీ తీసుకోబోమని తెలిపింది. నాలుగో టెస్టు కూడా అహ్మదాబాద్ లోని మొతెరా వేదికగానే జరుగనుంది. మార్చి 4న మ్యాచ్ మొదలు కానుంది. ఈ సిరీస్ లో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కూల్చాడు. అయితే, రెండో మ్యాచ్ కు దూరమయ్యాడు. మళ్లీ మూడో మ్యాచ్ ఆడినా.. ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా వాడుకోలేదు.  

నాలుగో టెస్టుకు భారత్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్

డేనైట్‌ టెస్టును రెండు రోజుల్లోనే ముగించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (5/32), అశ్విన్‌ (4/48) చెలరేగడంతో  ఇంగ్లండ్‌    రెండో ఇన్నింగ్స్‌లో 30.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. అంతకు ముందు గురువారం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 53.2 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలడంతో లభించిన 33 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్‌ ముందు 49 పరుగుల లక్ష్యం నిలిచింది. రోహిత్‌ శర్మ (25 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), శుబ్‌మన్‌ గిల్‌ (15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) 7.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.  టీమ్‌ఇండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. భారత్‌ ఇది గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle