newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

14-04-202114-04-2021 09:06:23 IST
Updated On 14-04-2021 10:17:13 ISTUpdated On 14-04-20212021-04-14T03:36:23.732Z14-04-2021 2021-04-14T03:36:14.694Z - 2021-04-14T04:47:13.919Z - 14-04-2021

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజస్థాన్ రాయల్స్.. మొదటి ఐపీఎల్ సీజన్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆ స్థాయి ఆటతీరును ప్రదర్శించడానికి చాలా కష్టాలే పడుతోంది. ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ కు వెళ్ళడానికి, టైటిల్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ సీజన్ లో సంజూ శాంసన్ కు కెప్టెన్సీ పగ్గాలను ఇచ్చింది. దీంతో ఆ జట్టు లక్ మారుతుందని భావించారు. అయితే ఊహించని విధంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సీజన్ నుండి వైదొలిగాడు. 

బెన్‌స్టోక్స్ గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి వేలికి గాయమైంది. ఆ తర్వాత ఫీల్డింగ్, బౌలింగ్ కూడా చేశాడు. ఛేజింగ్ లో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ తొలి ఓవర్‌లోనే అవుటై పెవిలియన్ చేరాడు. అతడి వేలికి స్కానింగ్ చేయగా అది విరిగినట్టు తేలింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. మ్యాచ్‌లు ఆడకపోయినా ఇక్కడే ఉంటాడని, ఆటగాళ్లకు సలహాలు ఇస్తాడని తెలిపింది. 

'రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులోని ప్రతి ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను ఎంతగానో ప్రేమిస్తాడు. జట్టుకు ఉన్న అతిపెద్ద ఆస్తి అతడు. మైదానం లోపల, వెలుపల రాయల్స్‌ కుటుంబంలో అతడికి తగినంత ప్రాధాన్యం ఉంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్టోక్స్ ఎడ‌మ వేలికి గాయ‌మైంది. వైద్య ప‌రీక్ష‌ల్లో అత‌డి వేలు విరిగిన‌ట్లు తెలిసింది. దీంతో ఈ సీజ‌న్ మొత్తానికి బెన్ దూర‌మ‌య్యాడు. మ్యాచ్‌లు ఆడ‌కున్నా ఇక్క‌డే ఉండి మైదానం బ‌య‌ట నుంచి బెన్ స‌ల‌హాలు ఇవ్వ‌బోతున్నాడు.

స్టోక్స్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. త్వరలోనే తన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని సిద్ధం చేస్తాం'. అని రాజ‌స్థాన్ ట్వీట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ ల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆర్చర్ ఇప్పటికే సీజన్ నుండి తప్పుకోగా.. బెన్ స్టోక్స్ ఇప్పుడు గాయపడడంతో సీజన్ నుండి వైదొలిగాడు. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ తర్వాతి మ్యాచ్ లలో పుంజుకోవాలంటే భారత ఆటగాళ్లు రాణించాల్సి ఉంది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle