newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

23-11-202023-11-2020 18:57:42 IST
Updated On 24-11-2020 11:18:07 ISTUpdated On 24-11-20202020-11-23T13:27:42.170Z23-11-2020 2020-11-23T13:27:24.797Z - 2020-11-24T05:48:07.490Z - 24-11-2020

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(ఐపీఎల్) జ‌రుగుతుందో లేదోన‌ని అనుకుంటున్న త‌రుణంలో దుబాయ్ వేదిక‌గా ఈ మెగా టోర్నీని స‌క్సెస్ పుల్‌గా నిర్వ‌హించి అందిరి చేత శెబాష్ అనిపించుకుంది భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ.. ఈ మెగా టోర్నీని నిర్వ‌హించారు. ఐపీఎల్ 2020 సీజ‌న్ విజేత‌గా ముంబై ఇండియ‌న్స్ నిలిచి.. ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఎప్పుడూ అభిమానుల కేరింత‌ల‌తో ఉత్స‌హాభ‌రితంగా క‌నిపించే మైదానాలు ఈ సారి ఎవ‌రూ లేక వెల‌వెల‌బోయాయి. అయినా ఆ లోటు క‌నిపించ‌కుండా నిర్వాహాకులు వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో ఆలోటు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

అంతేకాదండోయ్‌.. ఈలీగ్ ద్వారా బీసీసీఐ మంచి ఆదాయాన్ని ఆర్జించింద‌ని కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. ఐపీఎల్‌ 2020 సీజ‌న్ ద్వారా ఏకంగా రూ.4వేల కోట్ల ఆదాయం తమకు వచ్చినట్లు అరుణ్‌ ధుమాల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్ల‌డించారు. టీవీ వ్యూయర్‌షిప్‌ కూడా గతేడాదితో పోలిస్తే.. 25 శాతం పెరిగినట్లు చెప్పారు. అలాగే గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది దాదాపుగా 35శాతం ఖర్చులను బోర్డు త‌గ్గించుకున్న‌ట్లు  పేర్కొన్నారు. ఈ సీజ‌న్ నిర్వ‌హించ‌డం పై తొలుత అంద‌రూ అనుమానాలు వ్య‌క్తం చేశార‌ని.. అయిన‌ప్ప‌టికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైషా ధైర్యం చేసి ముంద‌డుగు వేశార‌న్నారు.

చెన్నై జ‌ట్టులో క‌రోనా కేసులు తేల‌డంతో కాస్త ఆలోచించామ‌ని.. అయితే వారిలో లక్ష‌ణాలు లేక‌పోవ‌డంతో ఐసోలేష‌న్‌లో ఉంచి ప‌ర్య‌వేక్షించామ‌న్నారు. ఇక ఈ ఐపీఎల్‌లో భాగంగా 18వందల మందికి 30వేలకు పైగా కరోనా టెస్ట్‌లు నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2020కి ఆతిథ్యం ఇచ్చినందుకు గానూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)కి బీసీసీఐ రూ.100 కోట్లు చెల్లించింది.

 

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   an hour ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   8 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

   13-01-2021


అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

   13-01-2021


ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle