newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ కలకలం..!

04-10-202004-10-2020 12:17:09 IST
2020-10-04T06:47:09.356Z04-10-2020 2020-10-04T06:46:51.306Z - - 21-10-2020

ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ కలకలం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ యూఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫిక్సింగ్‌ వ్యవహాం తీవ్ర కలకలం రేపుతోంది. తనను బుకీలు సంప్రదించారనే విషయాన్ని ఓ ఆటగాడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) యాంటి కరప్షన్‌(ఏసీయూ) తెలియజేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఏసీయూ విచారణ మొదలు పెట్టింది.

ఫిక్సర్‌ గురించి ఓ ఆటగాడు మాకు తెలిపాడు. మేం అతడిని పట్టుకునే పనిలో ఉన్నాం. దీనికి కాస్త సమయం పట్టవచ్చునని ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తెలిపారు.

ఇప్పటికే బుకీలు దుబాయ్‌లో తిష్టవేసారని, టోర్నీ సజావుగా జరిగేందుకు మూడు టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లను కలవడం బుకీలకు దాదాపుగా అసాధ్యం అన్నారు. అయితే.. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ద్వారా బుకీలు సంప్రదించే ఛాన్స్ లేకపోలేదనే వాదన కూడా ఉంది.

మరోవైపు ఆటగాళ్లందరికి ప్రొటోకాల్స్‌పై అవగాహన ఉందని.. ఇప్పటికే వారంత అనేక యాంటీ కరప్షన్ క్లాస్‌లు విన్నారని బీసీసీఐ తెలిపింది. బుకీలు సంప్రదించిన ఆటగాడు ఏదో జరుగుతుందని పసిగట్టి ఏసీయూకి సమాచారమిచ్చాడని అన్నది. 'గొప్ప విషయం ఏంటంటే.. బుకీ సంప్రదించిన ఆటగాడు ఏదో జరుగుతుందని వెంటనే గ్రహించాడు. అతనికి అనుమానం కలగడంతో వెంటనే ఏసీయూకి సమాచారాం ఇచ్చాడు. ప్రతి ఆటగాడికి ఆఖరికి అండర్ -19 నుంచి వచ్చిన ప్లేయర్స్‌కు కూడా యాంటి కరప్షన్ ప్రొటోకాల్స్ గురించి అవగాహన ఉంది'అని బీసీసీఐ వెల్లడించింది. ఏసీయూ గైడ్‌లైన్స్‌ ప్రకారం బుకీ సంప్రదించిన ఆటగాళ్లు లేక ప్రాంఛైజీల పేర్లను వెల్లడించకూడదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle