newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

05-05-202105-05-2021 08:18:56 IST
Updated On 05-05-2021 09:52:01 ISTUpdated On 05-05-20212021-05-05T02:48:56.209Z05-05-2021 2021-05-05T02:48:47.549Z - 2021-05-05T04:22:01.750Z - 05-05-2021

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021 సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం ఈ ప్రకటన విడుదల చేశారు. వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్‌-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో టోర్నీని వాయిదా వేసింది బీసీసీఐ. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను ప్రస్తుతానికి ముగించేసింది. 

ఈ సీజన్ ను పూర్తిగా రద్దు చేయలేదని బీసీసీఐ చెబుతోంది. మిగిలిన మ్యాచ్ లను కొనసాగించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 10 రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.  బీసీసీఐ గవర్నింగ్‌ సమావేశంలో ఇదే విషయంపై చర్చించిన తర్వాత ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో ఉన్న మూడు క్రికెట్‌ స్టేడియాల్లో మిగిలిన సీజన్‌ జరపాలని బీసీసీఐ భావిస్తూ ఉంది. ముంబైలో పూర్తిస్థాయి బయోబబుల్‌లో ఉంచి టోర్నీ నిర్వహించడానికే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

భారత్‌లో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఉన్న సిటీ ముంబై కావడంతో బీసీసీఐ టోర్నీని అక్కడే ముగించాలని భావిస్తూ ఉంది. బాంబే జింఖానా గ్రౌండ్‌, బ్రబోర్న్‌ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ముంబైలో ఉండడంతో టోర్నీని సులువుగా ముగించేయొచ్చు. ఇక జూన్ నెలలో జరపడంపై కూడా యోచిస్తోంది. భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌతాంప్టన్‌ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను వాయిదా వేయాల్సి ఉంది. జూన్‌ 18న డబ్యూటీసీ ఫైనల్‌ ఆరంభం కానుంది. అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌కు ముందే ఐపీఎల్‌ మిగతా సీజన్‌ను పూర్తి చేద్దామా అనే ఆలోచన కూడా ఉంది.

ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే కొంతమంది లీగ్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోగా, ఇంకా చాలామంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు. వారితో పాటు ఆసీస్‌కు చెందిన కోచింగ్‌ స్టాఫ్‌, సహాయక సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబాలు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మే15 వరకూ భారత్‌ విమానాలను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో స్వదేశాలకు వెళ్లాలో వారికి అర్థం కావడం లేదు. క్రికెట్‌  ఆస్ట్రేలియా(సీఏ) కూడా తాము ఏమీ చేయలేమని చేతులెత్తేసింది.

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   10 hours ago


ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021


WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021


World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021


2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021


SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021


మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021


డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021


ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021


క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

   06-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle