newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

ఆఖర్లో మోరిస్ మెరుపులు.. పంజాబ్ ఛేజ్ చేసేనా

15-10-202015-10-2020 21:33:50 IST
2020-10-15T16:03:50.693Z15-10-2020 2020-10-15T16:01:24.024Z - - 26-10-2020

ఆఖర్లో మోరిస్ మెరుపులు.. పంజాబ్ ఛేజ్ చేసేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఓడిపోయిన చాలా మ్యాచ్ లలో ఓ దశలో గెలుస్తూ ఉన్నట్లే అనిపించినా.. ఆఖర్లో బోల్తా కొట్టేస్తూ ఉంటుంది. బెంగళూరుతో షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో అలా జరగకూడదని పంజాబ్ అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఓ మోస్తరు స్కోరుకే బెంగళూరును కట్టడి చేయాలని అనుకున్నప్పటికీ ఆఖర్లో క్రిస్ మోరిస్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు మంచి స్కోరును నమోదు చేసింది. ఒకే ఓవర్ లో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ ను మొహమ్మద్ షమీ అవుట్ చేసి తన సత్తాను చాటుకున్నాడు. అదే మొహమ్మద్ షమీ తన ఆఖరి ఓవర్ లో మోరిస్ తో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టించుకున్నాడు. 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ 39 బంతుల్లో 48 పరుగులు చేయగా, ఆఖర్లో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్ లతో 25 పరుగులు సాధించాడు.  పంజాబ్ బౌలర్లు చివరి ఓవర్ ముందుకు వరకు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ లాస్ట్ లో మోరిస్ సమీకరణాలను మార్చేశాడు.  ఓపెనర్లు ఫించ్ 20, పడిక్కల్ 18 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, మురుగన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. అర్షదీప్, క్రిస్ జోర్డాన్ చెరో వికెట్ పడగొట్టారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle