భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-202115-01-2021 16:10:53 IST
2021-01-15T10:40:53.847Z15-01-2021 2021-01-15T10:40:49.847Z - - 07-03-2021

బ్రిస్బేన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా దూకుడు ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 274 పరుగులు చేసింది. కెప్టెన్ టిమ్ పైన్ (38), కామెరాన్ గ్రీన్ (28) క్రీజులో ఉన్నారు. 17 పరుగులకే ఓపెనర్లు వార్నర్ (1), మార్కస్ హారిస్ (5) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ (108) సెంచరీ సాధించాడు. తొలి టెస్టు ఆడుతున్న నటరాజన్ బౌలింగ్ లో బంతి బౌన్స్ ను అంచనా వేయడంలో పొరబడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 36 పరుగులు చేయగా, మాథ్యూ వేడ్ 45 పరుగులు నమోదు చేశాడు. లబుషేన్ క్యాచ్ లను భారతజట్టు డ్రాప్ చేయడంతో భారీ మూల్యం చెల్లించుకుంది భారత్.
ఈ మ్యాచ్ ద్వారా ఎడమచేతివాటం పేస్ బౌలర్ టి.నటరాజన్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలిరోజు ఆటలో 20 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సిరాజ్ కు ఓ వికెట్, శార్దూల్ ఠాకూర్ కు ఓ వికెట్ లభించింది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు.
టెస్టు సిరీస్‌లో భారత ఆటగాళ్లను ఒకరి తర్వాత మరొకరిని గాయాలు పలకరిస్తూనే ఉన్నాయి. తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరం కాగా, ఆ తర్వాతి నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతూ వచ్చారు. తొలి టెస్టులో గాయపడిన పేసర్ మహ్మద్ షమీ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు గాయాల బారినపడ్డారు. దీంతో వారి స్థానాలను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్ల జాబితా 20కి పెరిగింది. ఓ సిరీస్‌లో భారత జట్టు ఇంతమంది ఆటగాళ్లను ఆడించడం 1961-62 తర్వాత ఇదే తొలిసారి. 2014-15 నాటి ఆస్ట్రేలియా పర్యటనలో, 2018 నాటి ఇంగ్లండ్ పర్యటనలో, 1959 నాటి ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు 17 మందిని ఆడించింది. ఈసారి ఏకంగా 20 మంది ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఈ సిరీస్‌తో మొత్తం ఆరుగురు యువ ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం విశేషం. శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
16 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
17 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
20 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
21 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా