newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

27-11-202027-11-2020 18:02:52 IST
Updated On 27-11-2020 18:05:28 ISTUpdated On 27-11-20202020-11-27T12:32:52.114Z27-11-2020 2020-11-27T12:32:48.299Z - 2020-11-27T12:35:28.739Z - 27-11-2020

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సిడ్ని వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో భార‌త్ జ‌ట్టు 66 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. 375 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 308ప‌రుగుల‌కు మాత్ర‌మే ప‌రిమితమైంది. భార‌త ఆట‌గాళ్ల‌లో హార్థిక్ పాండ్యా (90; 76 బంతుల్లో 7 పోర్లు, 4 సిక్స‌ర్లు), శిఖ‌ర్ ధావ‌న్ (74; 86 బంతుల్లో 10పోర్లు)లు మాత్ర‌మే రాణించ‌గా.. మిగ‌తా ఆట‌గాళ్లు దారుణంగా విఫ‌లం కావ‌డంతో.. తొలి వ‌న్డేల్లో భార‌త్ ఓట‌మిని చ‌విచూసింది. 

375  ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌(22; 18 బంతుల్లో 2 పోర్లు, 1 సిక్స్‌) శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ప్రారంభించారు. ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్‌ను మెయింటైన్‌ చేస్తూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. 5 ఓవర్లలో 53 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. అయితే హజిల్‌వుడ్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి మయాంక్‌ ఔటయ్యాడు. ఆఫ్‌ సైడ్‌ ఆడబోయిన బంతిని మ్యాక్స్‌వెల్‌ క్యాచ్‌గా పట్టుకోవడంతో మయాంక్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  కోహ్లి(21; 21 బంతుల్లో 2 పోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, వెంటనే అయ్యర్‌(2) కూడా ఔటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌(12; 15 బంతుల్లో 1పోర్ ) నిరాశపరిచాడు. కోహ్లీ, అయ్య‌ర్ ను హ‌జిల్‌వుడ్ పెవిలియ‌న్ చేర్చ‌గా.. రాహుల్ జంపా ఔట్ చేశాడు. దీంతో 101 ప‌రుగుల‌కే నాలుగు కోల్పోయి భార‌త్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో పడింది.

ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దిన పాండ్యా-శిఖ‌ర్ జోడి 

ఈ ద‌శ‌లో పాండ్యా-శిఖ‌ర్ జోడి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను తీసుకున్నారు. పాండ్యా ధాటిగా ఆడ‌గా.. శిఖ‌ర్ అత‌డికి చ‌క్కిని స‌హ‌కారం అందించారు. ఇద్ద‌రూ అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 128 ప‌రుగులు జోడించారు. కొద్ది తేడాతో ఈ ఇద్ద‌రిని ఆడ‌మ్ జంపా పెవిలియ‌న్ చేర్చాడు. అప్ప‌టి భార‌త స్కోర్ 6 వికెట్ల న‌ష్టానికి 246 ప‌రుగులు. అప్ప‌టికే దాదాపు భార‌త ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా (25; 37 బంతుల్లో 1 సిక్స్‌), న‌వ‌దీప్ సైనీ( 29 ;35 బంతుల్లో 1 పోర్, 1 సిక్స్‌), మ‌హ్మ‌ద్ ష‌మీ (13; 10 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) లు ఓ మోస్తార్‌గా బ్యాటింగ్ చేయ‌డంతో.. భార‌త్ 300 ప‌రుగుల మార్క్‌నైనా దాట‌గ‌లిగింది.  ఆసీస్ బౌల‌ర్ల‌లో జంపా నాలుగు వికెట్లు తీయ‌గా.. హ‌జిల్‌వుడ్ మూడు వికెట్ల‌తో రాణించాడు. 

శ‌త‌కాల‌తో స‌త్తా చాటిన ఫించ్, స్మిత్

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (114; 124 బంతుల్లో 9 పోర్లు, 2 సిక్స‌ర్లు), స్టీవ్ స్మిత్( 105 ;66 బంతుల్లో 11 పోర్లు, 4 సిక్స‌ర్లు) డేవిడ్ వార్న‌ర్‌( 69; 76 బంతుల్లో 6 పోర్లు) లు  రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆసీస్ 6 వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగుల భారీ స్కోర్‌ చేసింది.  

ముందుగా టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ పించ్ మ‌రో ఆలోచ‌నకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌ పిచ్‌పై కంగారూ  ఓపెన‌ర్లు ఫించ్‌, వార్న‌ర్ లు అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చారు.  మొద‌ట ఆచితూచి ఆడిన ఈ జోడి.. త‌రువాత త‌మ బ్యాట్ల‌కు ప‌ని చెప్పారు. ముఖ్యంగా ఫించ్ ప్ర‌తి బంతిని బౌండ‌రీ దాటించాలి అన్న క‌సితో బ్యాటింగ్ చేశాడు. తొలి వికెట్ కు 156 ప‌రుగులు జోడించిన అనంత‌రం వార్న‌ర్‌ను ష‌మీ వెన‌క్కు పంపాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన స్మిత్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. రెండో వికెట్‌కు వీరిద్ద‌రు  108 ప‌రుగులు జోడించి జ‌ట్టును ప‌టిష్ట స్థితిలో నిలిపారు. శ‌త‌కం సాధించి మంచి ఊపులో ఉన్న ఫించ్‌ను బుమ్రా వెన‌క్కి పంప‌గా.. ఆడిన మొద‌టి బంతికే స్టొయినిస్‌ను చాహ‌ల్ ఔట్ చేయాడు. దీంతో వెంట వెంట‌నే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ ద‌శ‌లో భార‌త బౌల‌ర్లు పుంజుకుంటార‌ని బావించ‌గా.. అభిమానుల ఆశ‌ల‌పై మాక్స్‌వెల్ నీళ్లు చ‌ల్లాడు. వ‌చ్చి రావ‌డంతోనే బౌండ‌రీల‌తో విరుచుప‌డ్డాడు. 19 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్స‌ర్లు సాయంతో 45 ప‌రుగులు చేశాడు. చివ‌ర్లో బార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో.. ఆసీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు తీయ‌గా.. బుమ్రా, చాహ‌ల్‌, సైనీ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.  

 

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   2 hours ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   6 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   9 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   7 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle