newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

ధోని, కోహ్లీల‌కు షాకిచ్చిన నెహ్రా

19-11-202019-11-2020 18:11:35 IST
2020-11-19T12:41:35.688Z19-11-2020 2020-11-19T12:41:32.064Z - - 29-11-2020

ధోని, కోహ్లీల‌కు షాకిచ్చిన నెహ్రా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు ఆశిష్ నెహ్రా త‌న ఐపీఎల్ డ్రీమ్‌ను ప్ర‌క‌టించాడు. ఇందులో భార‌త మాజీ కెప్టెన్ ధోని, ప్ర‌స్తుత కెప్ట‌న్ విరాట్ కోహ్లీల‌‌కు త‌న జ‌ట్టులో చోటివ్వ‌లేదు. ఇటీవ‌ల ముగిసిన ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆట‌గాళ్లు క‌న‌బ‌రిచిన ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా త‌న జ‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు చెప్పుకొచ్చాడు. 

క‌రోనా కార‌ణంగా క్రీడా టోర్నీలు నిలిచిపోగా.. క్రికెట్ అభిమానుల‌ను ఐపీఎల్ 2020 సీజ‌న్ అల‌రించింది అన‌డంలో సందేహాం లేదు. టోర్నీ ఆసాంతం ఉత్కంఠభ‌రిత మ్యాచ్‌ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లు ఊగించింది. ముంబై ఇండియ‌న్స్ ఐదో సారి టైటిల్ అందుకోగా.. తొలిసారి చెన్నై ప్లే ఆఫ్స్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. ఇక ప్ర‌తి మెగా టోర్నీ ముందు, త‌రువాత క్రికెట్ దిగ్గ‌జాలు త‌మ ఫేవ‌రేట్ ఆట‌గాళ్ల‌తో డ్రీమ్ టీమ్‌ల‌ను ప్ర‌క‌టించ‌డం సాదార‌మే. తాజాగా ముగిసిన ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా టీమ్ఇండియా మాజీ బౌల‌ర్ నెహ్రా త‌న టీమ్‌ను ఎంచుకున్నారు. 

టోర్నీలో అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా నిలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఓపెన‌ర్ గా ఎంచుకోగా.. మ‌రో ఓపెన‌ర్ హైద‌రాబాద్ సార‌థి డేవిడ్ వార్న‌ర్‌ల‌ను తీసుకున్నాడు. మూడో స్థానంలో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ప‌లు కీల‌క ఇన్నింగ్స్ లు ఆడిన సూర్య‌కుమార్ యాద‌వ్‌ను జ‌ట్టులో తీసుకున్నాడు. ఇక నాలుగో స్థానంలో మిస్ట‌ర్ 360డిగ్రీస్ ఏబీడివిలియ‌ర్స్‌, ఐదో స్థానంలో ఐదో స్థానంలో ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్, ఆరో స్థానంలో ముంబై ఇండియన్స్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసుకున్నాడు. ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్‌ను తన జట్టు వికెట్ కీపర్‌గా నెహ్రా ఎంచుకున్నాడు. 

బౌల‌ర్ల జాబితాలో  రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్న ఆశిష్ నెహ్రా.. వీరిద్దరూ బ్యాటింగ్ కూడా చేయగలరన్నాడు. బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకున్నాడు. చివరి స్థానం కోసం మొహమ్మద్ షమీ, ఆర్ అశ్విన్‌లు ఎంచుకున్నాడు. ముగ్గురు పేసర్లతో ఆడాల్సి వస్తే షమీని తుది జట్టులోకి తీసుకుంటానని.. లేదంటే అశ్విన్‌ను ఎంపిక చేస్తానని నెహ్రా చెప్పాడు.

నెహ్రా ఐపీఎల్ 2020 డ్రీమ్ జట్టు :

కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్‌, ఏబీ డివిలియర్స్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ/ఆర్ అశ్విన్‌.

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   11 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   15 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   17 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   18 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle