newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!

29-09-202029-09-2020 13:41:47 IST
2020-09-29T08:11:47.276Z29-09-2020 2020-09-29T08:11:42.845Z - - 25-10-2020

థ్రిల్లింగ్ మ్యాచ్ పై అనుష్క స్పందన..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్‌లో  ముంబై ఇండియ‌న్స్ పై బెంగుళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ విజయం సాధించింది. ఆర్సీబీ సూపర్ ఓవర్ లో  గెలుపొందడంతో కోహ్లీ భార్య అనుష్క శర్మ హర్షం వ్యక్తం చేసింది. 'ఓ గ‌ర్భిణి.. మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంతక‌న్నా థ్రిల్లింగ్ ఏముంటుంది' అని అనుష్క సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 201 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ కూడా అంతే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయింది. విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా అందులో బెంగళూరు విజయం సాధించింది. 

ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ ముంబైకి ఆ నిర్ణయం కలిసి రాలేదు. బెంగళూరు బ్యాట్స్మెన్ బాగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 54 (5 ఫోర్లు, 2 సిక్స్ లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్ కు 81 పరుగులతో శుభారంభం అందించాడు. చివర్లో ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్ లు), శివం దూబే (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్ లు) ధాటిగా ఆడడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, రాహుల్ చహర్ ఓ వికెట్ సాధించారు.

లక్ష్య ఛేదనలో ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. రోహిత్ శర్మ ఎనిమిది బంతులు ఆడి 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. డికాక్ 14 పరుగులు చేయగా.. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే ఇషాన్ కిషన్-పొలార్డ్ జోడీ మ్యాచ్ ను చివరి దాకా తీసుకుని వెళ్ళింది. ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో మ్యాచ్‌ టై అయ్యింది. చివరి 5 ఓవర్లలో వీరిద్దరూ అద్భుతమైన హిట్టింగ్ చేశారు. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. పొలార్డ్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా, రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల టార్గెట్  ఇచ్చింది. 

ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. మొదటి రెండు బంతులు.. ఒక్కో పరుగు తీయగా.. మూడో బంతి డాట్ బాల్ అయింది. బుమ్రా మ్యాజిక్ చూడొచ్చని భావించగా.. నాలుగో బంతిని ఫోర్ కొట్టాడు ఏబీడీ.. ఐదో బంతి కాస్తా సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి కోహ్లీ ఫోర్ కొట్టడంతో బెంగళూరు విజయాన్ని అందుకుంది.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle