newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

చెన్నైకు మరో షాక్.. టోర్నమెంట్ మొత్తానికి దూరమా..?

19-10-202019-10-2020 09:58:06 IST
Updated On 19-10-2020 10:01:49 ISTUpdated On 19-10-20202020-10-19T04:28:06.108Z19-10-2020 2020-10-19T04:27:48.912Z - 2020-10-19T04:31:49.144Z - 19-10-2020

చెన్నైకు మరో షాక్.. టోర్నమెంట్ మొత్తానికి దూరమా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది ఐపీఎల్ లో వీరి జర్నీ చాలా వైవిధ్యంగా ఉంది. సీజన్ మొదలవ్వకముందు కరోనా కలకలం.. సురేష్ రైనా, హర్భజన్ జట్టుకు దూరం అవ్వడం. ధోని దగ్గరుండి గెలిపిస్తాడు అని అనుకుంటే పెద్దగా రాణించకుండా పోతుండడంతో చెన్నై వరుస ఓటములను చవి చూస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో ఓడిపోయింది. 

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌ బ్రేవో కుడి కాలి తొడ కండరాల గాయంతో చెన్నై ఆడే తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడని కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. ఎన్ని మ్యాచ్ లకు దూరం అవుతాడనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. అతడు కోలుకోవడానికి కొద్ది రోజులు లేదా రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో గాయపడ్డాడు. తన ఓవర్ల కోటాను పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌ వరకూ వెళ్లిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ సింగిల్‌ తీయగా,  అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పాడు.  ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్‌.. ఐదో బంతికి మరో సిక్స్‌ కొట్టి ఢిల్లీని గెలిపించాడు.

మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. చివరి ఓవర్‌ను జడేజాకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. ‘ ఆఖరి ఓవర్‌ను బ్రేవోకు ఇవ్వాలనుకున్నాం. కానీ బ్రేవో ఫిట్‌గా లేడు. అతని డగౌట్‌లోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో నాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి జడ్డూ(జడేజా), రెండు కరణ్‌ శర్మ. దాంతో జడేజాకు ఇవ్వడానికి మొగ్గుచూపాను’ అని తెలిపాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

జొకోవిక్ ఎపిక్ ఫైనల్‌లో 19 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టించాడు

   10 hours ago


ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

ఎంఎస్ ధోని ప్లేటైమ్ విత్ పోనీ వీడియో షేర్ చేసిన సాక్షి

   13-06-2021


WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

WTC Final: సౌతాంప్టన్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌ లో టీమ్ ఇండియా

   12-06-2021


World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

World Test Championship Final: ఇండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న తాజా వీడియో

   11-06-2021


2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

2007 టీ 20 ప్రపంచ కప్ కెప్టెన్ నేనే అనుకున్నా : యువరాజ్

   10-06-2021


SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

SRH టీమ్‌మేట్స్‌ మనీష్ పాండే మరియు రషీద్ ఖాన్ తో డేవిడ్ వార్నర్

   10-06-2021


మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

మోర్గాన్, బట్లర్ చేసిన జాత్యహంకార ట్వీట్ల పై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం: ఇసిబి

   09-06-2021


డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

డబ్ల్యుటిసి ఫైనల్ తరువాత బయో బబుల్ లైఫ్ నుండి విరామం పొందడానికి భారత జట్టు: రిపోర్ట్

   08-06-2021


ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

ప్రాక్టీస్-మ్యాచ్ లేకపోవడం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లను కూడా దెబ్బతీస్తుంది: దిలీప్ వెంగ్‌సర్కర్

   07-06-2021


క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

క్వారంటైన్ 3 వ రోజు నుండే భారత ఆటగాళ్ళు వ్యక్తిగత శారీరక శిక్షణకు అనుమతి

   06-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle