newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

14-04-202114-04-2021 15:45:41 IST
2021-04-14T10:15:41.137Z14-04-2021 2021-04-14T10:15:38.301Z - - 15-05-2021

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంగళవారం ముంబై ఇండియన్స్ జట్టుపై విజయం కనుచూపు మేర దోబూచులాడిన క్షణాల్లో అనూహ్యంగా ఓటమి పాలైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ జట్టు అభిమానులకు క్షమాపణ చెప్పాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ లీగ్ 5వ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

15 ఓవర్లు ముగిసేటప్పటికి 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసిన కేకేఆర్ జట్టు చివరి అయిదు ఓవర్లలో 31 పరుగులు చేయలేక చతికిలపడటంతో జట్టు సహయజమాని, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నిర్వేదంతో జట్టు అభిమానులకు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశాడు. 30 బంతుల్లో 31 పరుగులు సాధించడం ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా సులభ సాధ్యమే కానీ ముంబై ఇండియన్స్ డెత్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాల ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా తలవంచింది.

మాజీ క్రికెటర్లు కూడా చివరి అయిదు ఓవర్లలో కేకేఆర్ జట్టు అనూహ్య పరాజయానికి దిగ్బ్రాంతి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చాలా నిరాశ కలిగింది. కేకేఆర్ జట్టు అభిమానులకు క్షమాపణలు అంటూ షారుక్ ఖాన్ ట్వీట్ చేయడం వైరల్ అయింది.

చివరి ఓవర్లలో జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేరుస్తాడనుకున్న ఆండ్రీ రస్సెల్ జట్టు పరాజయంపై షారుక్ ట్వీట్‌ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్ అనంతరం వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొన రస్సెల్.. జట్టు సహయజమాని షారూక్ క్షమాపణలు చెబుతూ చేసిన ట్వీట్‌ పట్ల ఏకీభావం ప్రకటించాడు. అదే సమయంలో క్రికెట్ ఆట తీరే అంత.. చివరి ఓవర్ వరకు గేమ్ మనదేనని భావించలేం అని రస్సెల్ చెప్పాడు.

అంతకుముందు కేవలం రెండు ఓవర్లలో 5 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ జట్టును వణికించిన విండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ కేకేఆర్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి 5 ఓవర్లలో బౌండరీలు సాధించలేక చతికిల పడ్డాడు. రెండు సార్లు క్యాచ్ మిస్ అయినప్పటికీ రస్సెల్ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. చివరి ఓవర్‌లో ముంబై డెత్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ భీకర బౌలింగ్ ధాటికి ఔటైన రస్సెల్ ఈ మ్యాచ్‌లో గెలుపు మాదే అనుకుంటే ఇలా జరిగిందంటూ వాపోయాడు

చివరి వరకు విజయంపై ధీమాతోనే ఉన్నాం. మంచిగానే ఆడాం. మా వాళ్లను చూసి గర్వపడుతున్నా.. కానీ అనూహ్య పరాజయంతో పూర్తిగా నిరాశకు గురయ్యాను. కానీ ఇంతటితో మా దారి మూసుకుపోయినట్లు కాదు. ఈ సీజన్‌లో మాకు ఇది రెండో గేమ్ మాత్రమే కాబట్టి తప్పకుండా పాఠాలు నేర్చుకుంటాం అని రస్సెల్ చెప్పాడు.

అనేక టీ20 మ్యాచ్‌లలో చివరి వరకు గెలుపుపై నమ్మకం పెట్టుకుని కూడా గల్లంతైపోయిన చాలా జట్లను తాను చూసానని రస్సెల్ పేర్కొన్నాడు. క్రికెట్ తీరే ఇంత అనుకుంటాను. వందలాది టీ20 గేమ్స్ ఆడాను. కాని ఈ పరాజయంతో చాలా నిరాశ చెందాము. కానీ ఇది రెండో గేమ్ మాత్రమే కాబట్టి జట్టుగా మేం పాఠాలు నేర్చుకుంటామని రస్సెల్ తెలిపాడు.

మంగళవారం రాత్రి మాకు ఎదురైన ఓటమిని అంత సులభంగా మర్చిపోలేం కానీ మాది మంచి జట్టు. మా ఆటగాళ్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే చెన్నై స్టేడియంలో ఇది కష్టమైన పిచ్. కొత్త బ్యాట్స్‌మన్ వచ్చీరాగానే బంతిని బాదడానికి ఇక్కడ అవకాశం ఉండదు. నాకు సైతం ఈ వికెట్ సవాలుగా నిలిచింది. మీరెంత బాగా ఆడినా ఈ పిచ్‌పై మీరు మెరుపులు సృష్టించలేరు అని రస్సెల్ పేర్కొన్నారు.

అయితే అద్భుతమైన ఆల్ రౌండర్ రస్సెల్, పంచ్ హిట్టర్ అయిన కెప్టెన్ దినేష్ కార్తీక్ ఇద్దరు ఉండి కూడా కేకేఆర్ జట్టు డెత్ బౌలింగులో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం క్రికెట్ దిగ్గజాలను సైతం షాక్‍కు గురిచేసింది. వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ ఇద్దరు బ్యాట్స్‌మన్ మూడ్‌పైనే సందేహాలు లేవనెత్తడం గమనార్హం.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle