newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

30-09-202030-09-2020 10:23:22 IST
Updated On 30-09-2020 10:26:18 ISTUpdated On 30-09-20202020-09-30T04:53:22.340Z30-09-2020 2020-09-30T04:53:19.120Z - 2020-09-30T04:56:18.892Z - 30-09-2020

డ్రీమ్ లెవెన్ కు అలా షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 డ్రీమ్ లెవెన్.. ప్రస్తుతం ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. పెద్ద పెద్ద స్టార్స్ ను ప్రమోషన్స్ కూడా ఉపయోగిస్తోంది డ్రీమ్ లెవెన్..! కానీ ఈ మొబైల్ యాప్, సైట్ పని తీరు చూస్తే దాదాపు బెట్టింగ్ తో సమానంగానే నడుస్తూ ఉంటుంది. కావాల్సిన ఆటగాళ్లను పెట్టుకోవడం.. వాళ్లు ఆడడం ద్వారా పాయింట్లు రావడం.. ఆఖరికి ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చేయడం. డ్రీమ్ లెవెన్ వలన సంపాదించుకున్న వారు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ.. పోగొట్టుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. 

దేశ వ్యాప్తంగా ఈ యాప్ కు బానిసలు అవుతున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఈ యాప్ ను ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేసినట్లు చెబుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన డ్రీమ్ 11 యూజర్లు సామాజిక మాధ్యమాల్లో యాప్ లో టీమ్ సెట్ చేసుకోవడం వంటివి కుదరడం లేదని చెబుతూ ఉన్నారు. 

దీనిపై డ్రీమ్ లెవెన్ ప్రతినిధులు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చిన గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్ లైన్ పెయిడ్ కాంటెస్టులు ఆడడానికి వీలు లేదని.. దీంతో డ్రీమ్ లెవెన్ ను ఆడడానికి ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు కుదరడం లేదని వెల్లడించారు. అస్సాం, ఒడిశా, తెలంగాణ, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా గేమింగ్ రూల్స్ లో సరైన క్లారిటీ లేకపోవడం వలన డ్రీమ్ లెవెన్ ను ఆయా ప్రాంతాల్లో ఆడలేకపోతున్నారు. 

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుండి డబ్బు సంపాదించాలనే ఆకాంక్షతో ఎంతో మంది డ్రీమ్ లెవెన్ యాప్ ను ఇంస్టాల్ చేసుకున్నారు. ఎలాగైనా ఈ సీజన్ లో లక్షలు సంపాదించాలనే కలలు కంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు డ్రీమ్ లెవెన్ ఆడడానికి లేకుండా చర్యలు తీసుకుంది. ఆన్ లైన్ లో డబ్బులు కట్టి ఆడే గేమ్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నారు. ఈ ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడి ఎంతో మంది లక్షలు, కోట్లలో కోల్పోతూ ఉన్నారు.  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle