newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ఆ ఒక్క ట్వీట్ తో చిక్కుల్లో పడ్డ క్రికెటర్

22-07-202122-07-2021 12:40:18 IST
2021-07-22T07:10:18.715Z22-07-2021 2021-07-22T07:10:06.282Z - - 17-10-2021

ఆ ఒక్క ట్వీట్ తో చిక్కుల్లో పడ్డ క్రికెటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలబ్రిటీలు ఎప్పుడు ఎలా నెటిజన్లకి ట్రోల్ అవుతారో అన్న విషయం తెలియకుండా వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెలబ్రిటీలు ఏదైనా విషయం పై స్పందించాలన్నా, మరో సెలబ్రిటీ ట్వీట్ కి రిప్లై ఇవ్వాలన్నా ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో తాము చేసిన ట్వీట్ కి ఇప్పుడు ట్రోల్ కావాల్సి వస్తుందని బహుశా ఆ సెలబ్రిటీ సైతం కలలో కూడా ఊహించుకుని ఉండని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కుంద్రా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉ‍న్నాడు. ఇదిలా ఉంటే టీమిండియా క్రికెటర్‌ అజింక్యా రహానేను రాజ్‌ కుంద్రా వ్యవహారం చిక్కుల్లో పడేలా చేసింది. విషయంలోకి వెళితే.. 2012లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడిగా ఉన్నప్పుడు రాజ్‌ కుంద్రాను మెచ్చుకుంటూ రహానే చేసిన ఒక పాత ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

''రాజ్‌ కుంద్రా మీరు చాలా గ్రేట్‌ జాబ్‌ చేస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి.'' అంటూ పేర్కొన్నాడు. అప్పటికి రాజస్తాన్‌ రాయల్స్‌ సహ యజమానిగా ఉన్న కుంద్రా రహానే ట్వీట్‌కు బదులిచ్చాడు. '' థ్యాంక్యూ సో మచ్‌ రహానే.. నేను చేసే పనిని నువ్వు కచ్చితంగా లైవ్‌లో చూడాలి'' అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి రహానే కూడా.. '' తప్పకుండా వస్తాను సార్‌'' అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అప్పుడు వీరు ఏ విషయం గురించి ఇలా ట్వీట్ చేసుకున్నారో తెలియదు కానీ రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు కావడంతో నెటిజన్లు ఈ పాత ట్వీట్ ను వైరల్ చేస్తూ రహానేని చిక్కుల్లో పడేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ వైరల్ పై రహానీ ఇంకా స్పందించలేదు.

ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్ర ఇలా కొనసాగింది

ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్ర ఇలా కొనసాగింది

   16-10-2021


కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఈరోజు ఏం చేస్తాడో?

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఈరోజు ఏం చేస్తాడో?

   15-10-2021


మరోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ ను గెలిపించిన బౌలర్లు

మరోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ ను గెలిపించిన బౌలర్లు

   14-10-2021


గ్లెన్ మాక్స్‌వెల్ సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్

గ్లెన్ మాక్స్‌వెల్ సోషల్ మీడియాలో చుక్కలు చూపిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ ఫ్యాన్స్

   13-10-2021


కోహ్లీ-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి మళ్ళీ నిరాశే.. కోల్‌కతా జైత్ర యాత్ర

కోహ్లీ-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి మళ్ళీ నిరాశే.. కోల్‌కతా జైత్ర యాత్ర

   12-10-2021


చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటకి విరాట్ కోహ్లీ, ప్రీతి జింటా ఫిదా

చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటకి విరాట్ కోహ్లీ, ప్రీతి జింటా ఫిదా

   11-10-2021


రుతురాజ్ క్లాస్, ఉతప్ప, ధోనీ మాస్ బ్యాటింగ్.. ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

రుతురాజ్ క్లాస్, ఉతప్ప, ధోనీ మాస్ బ్యాటింగ్.. ఫైనల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్

   11-10-2021


సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చివరి మ్యాచ్ లో దంచేసారు.. ఓడినా బాగా ఆడారు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చివరి మ్యాచ్ లో దంచేసారు.. ఓడినా బాగా ఆడారు

   09-10-2021


ప్లేఆఫ్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్.. ముంబై కి నో ఛాన్స్

ప్లేఆఫ్‌ లో కోల్‌కతా నైట్ రైడర్స్.. ముంబై కి నో ఛాన్స్

   08-10-2021


భారత్‌, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ రద్దు

భారత్‌, ఆస్ట్రేలియా మహిళల మద్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ రద్దు

   07-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle