షర్మిల సభ సక్సెస్ అయ్యేనా..?
06-04-202106-04-2021 08:47:35 IST
Updated On 06-04-2021 09:51:18 ISTUpdated On 06-04-20212021-04-06T03:17:35.727Z06-04-2021 2021-04-06T02:26:39.613Z - 2021-04-06T04:21:18.098Z - 06-04-2021

తెలంగాణలో పార్టీ స్థాపించాలని అనుకుంటూ ఉన్నారు వైఎస్ షర్మిల. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకుంటూ ఉన్నారు. ఓ వైపు సభ నిర్వహణకు అనుమతి వచ్చినా.. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా సభ సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందం ఇటీవల పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది. దీంతో పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చారు. మరో వైపు ఖమ్మంలో ఈ నెల 9న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంకల్పసభను విజయవంతం చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం లో ఆమె పాలేరు నియోజకవర్గానికి చెందిన యెనికే కిషోర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన సంకల్ప సభ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తమ పార్టీ విధి విధానాలను ఆవిష్కరించే ఈ సభకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని షర్మిల పిలుపునిచ్చారు. ఖమ్మంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అనుచరులు, కార్యకర్తలు భారీ జన సమీకరణకు పూనుకున్నారన్నారు. ఈ సభను కరోనా నిబంధనలకు అనుగుణంగా జరుపుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని షర్మిల కోరారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, న్యాయవాదులు కూడా పెద్ద సంఖ్యలో లోటస్‌పాండ్‌కు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్ తన పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు. నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు ఆరుగురు కూడా మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని సివిల్, క్రిమినల్ కోర్టులతో పాటు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మతీన్ ముజాద్దది షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. షర్మిలను కలిసిన వారిలో న్యాయవాదులు సుభాన్ జావీద్, సయ్యద్ నసీబ్ ఫహీమ్, సిద్దయ్య, కోటేశ్వరావు, నాజిబా సుల్తాన, ఎస్.జె.సుజాత, వాహెబ్ అలీ, ఎ.శ్రీధర్ తదితరులు ఉన్నారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
36 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా