newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఘాటు విమర్శలు..

15-09-202115-09-2021 09:05:43 IST
2021-09-15T03:35:43.969Z15-09-2021 2021-09-15T03:35:40.874Z - - 17-10-2021

కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఘాటు విమర్శలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ జుట్టు బిజెపి చేతుల్లో ఉందని అందుకే తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ సిఎం నిమ్మకుంది పోతున్నారని విమర్శించారు. కాగా వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షని హన్మకొండ వేదికగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ఈ సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు. నిరుద్యోగుల కలల సాకారం కోసం ఎన్ని వారాలైనా దీక్షలు చేస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలు వంచేదాకా దీక్షలు కొనసాగిస్తా’ అని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలకు ఉద్యో గాలు ఇవ్వని కేసీఆర్, ఎంతమంది త్యాగం చేశారని ఆ కుటుంబంలో ఐదుగురికి పదవులు ఇచ్చుకున్నా రని షర్మిల నిలదీశారు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా ఉద్యోగాల నోటిఫికేషన్‌ రావడం లేదని, నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక సిఎం కేసీఆర్ బిజెపితో చేతులు కలిపారని రాష్ట్రంలో బిజెపి నేతలు, టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నప్పటికీ అంతర్గతంగా ఇరు పార్టీలు కుమ్ముక్కయ్యాయని వైఎస్ షర్మిల అన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి షర్మిల కృషి చేస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూనే మరోవైపు అన్ని జిల్లాలలో చురుకైన నాయకులని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. 

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   2 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   2 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   a day ago


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

   14-10-2021


మంత్రి ఎర్రబెల్లిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు.. నీకు ఎంత మంది తండ్రులు అంటూ..

మంత్రి ఎర్రబెల్లిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు.. నీకు ఎంత మంది తండ్రులు అంటూ..

   13-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle