newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

16-04-202116-04-2021 15:03:05 IST
2021-04-16T09:33:05.634Z16-04-2021 2021-04-16T07:24:45.999Z - - 15-05-2021

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి తానొచ్చానని చెప్పుకుంటూ ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల. ఆమె ఇటీవలే ఖమ్మంలో బహిరంగ సభ కూడా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. మొదటి రోజు ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద వైఎస్ షర్మిల దీక్షను ప్రారంభించగా సాయంత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు, అభిమానుల మధ్య జరిగిన తోపులాటలో ఆమె ఒక దశలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె చేతికి గాయం కూడా అయ్యింది. గురువారం సాయంత్రం నుంచి లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లోనే షర్మిల ఆమె దీక్ష చేపట్టారు. నిన్నటి నుంచీ దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. దీక్షలో ఉన్న షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. 

మూడ్రోజుల పాటు దీక్ష చేపడుతానని షర్మిల చెప్పగా.. పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షకు అనుమతి లేదని అధికారులు ఆమెను తీసుకుని వెళ్లడంతో ఉద్రిక్తత మొదలైంది. ఒక్కరోజు దీక్షకే అనుమతి ఉందంటూ ఆమెను పోలీసు వాహనంలో లోటస్ పాండ్ నివాసానికి తరలించారు.  పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా చౌక్ నుంచి పాదయాత్రగా లోటస్ పాండ్ కు తరలి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం సందర్భంగా షర్మిల సొమ్మసిల్లిపోయారు. షర్మిల పాదయాత్రతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో పోలీసులు ఆమెను వాహనంలో అక్కడ్నించి తరలించారు.

పోలీసులు ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాంతో షర్మిల తన నివాసంలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇంకోసారి తనపై చేయి పడితే ఊరుకునేది లేదని ఆ సమయంలో షర్మిల హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదో ఒకరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కార్యకర్తలను వదిలేంత వరకు మంచినీళ్లు కూడా తాగనని స్పష్టం చేశారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle