newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

16-04-202116-04-2021 13:08:56 IST
2021-04-16T07:38:56.523Z16-04-2021 2021-04-16T07:33:59.294Z - - 15-05-2021

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గురువారం నాడు వైఎస్ షర్మిల ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు దిగారు.  నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్‌ షర్మిల వెల్లడించారు. అయితే దీక్ష సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 

సాక్షి మీడియా గురించి ఆమె అన్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. లైవ్‌లో ఉండగానే సాక్షి క‌వ‌రేజ్ మాకొద్దని.. మీరు వెళ్లిపోండ‌ని ఆమె చెప్పడంతో అంద‌రూ షాకయ్యారు. మీరెలాగూ మాకు క‌వ‌రేజ్ ఇవ్వరు కాబట్టి.. వెళ్లిపోవాల‌ని కెమెరామెన్‌కు ష‌ర్మిల చెప్పారు. వెంటనే ఆమె పక్కనే ఉన్న తల్లి విజయమ్మ షర్మిలను వారించారు. అయితే తన అన్న కుటుంబానికి చెందిన మీడియా సంస్థపై షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాలతో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్‌తో షర్మిలకు అభిప్రాయభేదాలు ఉన్నాయని.. ఈ కారణంగానే ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. తాను సీఎం జగన్ వదిలిన బాణాన్ని కాదని, తనకు వైసీపీలో ఎందుకు పదవి ఇవ్వలేదనే విషయాన్ని జగన్‌నే అడగాలని కూడా షర్మిల అన్నారు. ఇప్పుడు  సాక్షి మీడియాపై షర్మిల బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. షర్మిల ఏదో సరాదాగా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఆ సమయంలో ఆమె హావభావాలను బట్టి ఈ విషయం అర్థమవుతోందని అంటున్నారు.

'మీరట్లా చేస్తే ఎట్ల‌మ్మా... మేము దీక్ష చేస్తున్న‌ది మీ కోస‌మా..? జ‌నాల కోస‌మా..? ద‌య‌చేసి స‌హ‌క‌రించండి. మ‌ధ్య‌లో కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఆ మ‌ధ్య‌లో ఉన్న ఐదు కెమెరాల‌ను తీసి... కొంచెం ఇటు, కొంచెం అటు సైడ్ అయిపోండి. ఇక క‌వ‌రేజ్ చేసింది చాల్లేమ్మా... ఎట్లా సాక్షి మా క‌వ‌రేజీ ఇవ్వ‌దుగా...' అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యాఖ్యలకు షాక్ అయిన తల్లి విజయమ్మ.. వెంటనే చేత్తో తట్టి ఆమెను వారించే ప్రయత్నం చేశారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle