newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

15-04-202115-04-2021 17:33:15 IST
Updated On 15-04-2021 16:52:04 ISTUpdated On 15-04-20212021-04-15T12:03:15.981Z15-04-2021 2021-04-15T09:48:45.991Z - 2021-04-15T11:22:04.216Z - 15-04-2021

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్‌ షర్మిల దీక్ష కొనసాగనుంది. నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

పోలీసులు ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ ఆమె 72 గంట‌ల నిరాహార దీక్ష‌ను కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో ముందుండి పోరాటం చేసిన వారు విద్యార్థులని.. అలాంటిది వారు ఉద్యోగాలు లేక ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారని అన్నారు. ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్నారని చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని ష‌ర్మిల అన్నారు.

మొన్న సునీల్ నాయ‌క్ అనే యువ‌కుడు కాక‌తీయ యూనివ‌ర్సిటీలోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని.. త‌న చావు త‌ర్వాత‌యినా నోటిఫికేష‌న్లు రావాల‌ని చెప్పాడు. త‌న త‌ల్లిదండ్రుల‌కు భారమ‌వుతున్నాన‌ని సిరిసిల్ల‌లో మ‌హేంద‌ర్ యాద‌వ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. న‌ల్ల‌గొండ‌లో సంప‌త్ కుమార్ త‌న‌కు ఉద్యోగం వస్తుంద‌న్న ఆశ పోయింద‌ని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడని.. ఇలా ఒక్కొక్క‌రి గురించి చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. ఇంత జ‌రుగుతున్నప్ప‌టికీ దున్న‌పోతు మీద వాన ప‌డిన‌ట్లు కేసీఆర్ గారిలో మాత్రం చ‌ల‌నం లేదని షర్మిల చెప్పుకొచ్చారు. 

చందమామల్లాంటి మ‌న పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని కేసీఆర్ ఉద్యమాల సమయంలో చెప్పారని.. మ‌రి ఇప్పుడు చంద‌మామ లాంటి పిల్ల‌లు చ‌నిపోతుంటే కేసీఆర్ గారికి క‌నిపించ‌డం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఛాతిలో ఉన్న‌ది గుండెనా?  లేక బండ‌రాయా? ల‌క్షా 91 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఎందుకు భ‌ర్తీ చేయ‌ట్లేదు? కేసీఆర్ గారు స‌మాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు. ఏ ఇత‌ర పార్టీ పోరాటం చేసినా చేయ‌క‌పోయినా.. యువ‌తకు మ‌ద్దతుగా మేము నిల‌బ‌డ‌తామని ష‌ర్మిల భరోసా ఇచ్చారు.నేను 72 గంట‌లు నిరాహార దీక్ష చేస్తాను. నాలుగో రోజు నుంచి జిల్లాల్లోనే మా నాయ‌కులు దీక్ష‌లు చేస్తుంటారు. ఉద్యోగాలు భ‌ర్తీ చేసేంతవ‌ర‌కు మా పోరాటం కొన‌సాగుతూనే ఉంటుందని ష‌ర్మిల చెప్పారు. 

 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   4 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   27 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   38 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle