newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రైతులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు.. వైఎస్ షర్మిళ

12-06-202112-06-2021 11:10:48 IST
Updated On 12-06-2021 15:27:25 ISTUpdated On 12-06-20212021-06-12T05:40:48.359Z12-06-2021 2021-06-12T05:39:37.265Z - 2021-06-12T09:57:25.582Z - 12-06-2021

రైతులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు..  వైఎస్ షర్మిళ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ వ్యాప్తంగా తన ప్రచారాన్ని కొనసాగించడానికి వైఎస్ షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు. మొన్నటికి మొన్న ఆత్మహత్య కి పాల్పడ్డ నిరుద్యోగి కుటుంబ సభ్యులని స్వయంగా వెళ్లి పరామర్శించి వైఎస్ షర్మిల ఇప్పుడు రైతుల బాధల పై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా 3 రోజుల క్రితం వికారాబాద్‌ జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించిన విషయం తెలుసుకున్న షర్మిల... అన్నదాతల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శుక్రవారం పాలేపల్లిలో పర్యటించారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. 

ఈ సందర్భంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నా సీఎం కేసీఆర్‌ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరి గింజ వరకూ కొంటామని చెప్పి జూన్‌ వరకూ ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, రాజగోపాల్‌ పాల్గొన్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle