newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

20-09-202120-09-2021 07:31:09 IST
2021-09-20T02:01:09.445Z20-09-2021 2021-09-20T02:00:42.201Z - - 17-10-2021

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించినా అది హుజూరాబాద్ ఉప ఎన్నికలల్లో విజయం సాధించడమే ప్రధానంగా నాయకుల మాటలు ఉంటున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక టిఆర్ఎస్ సైతం గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలో నిలుపుతున్నట్లు చాలారోజుల క్రితమే ప్రక టించేసింది. ఈ క్రమంలో ఇంతవరకూ కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ స్థానం ఖాళీ అయి ఇన్ని రోజులవుతున్నా అభ్యర్థిత్వంపై అధిష్ఠానం ఇంతవరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలలో అయోమయం నెలకొంది. తొలుత జిల్లా నుంచి పత్తి కృష్ణారెడ్డి, కొండాసురేఖ పేర్లు వినిపించినా.. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఆ తరువాత ఉప ఎన్నిక కోసం దరఖాస్తులు కోరడం వారి కేడర్‌లో అయోమయాన్ని నింపింది. సెప్టెంబరు తొలివారంలో 18 మంది నేతలు హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. ఈ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కిరాలేదు. ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాక్షాత్తూ మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ వంటి సీనియర్‌ నేతకే పోటీగా అనేక మంది రెబెల్‌ నేతలు బరిలో దిగారు. టీపిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో మిగతా పార్టీలకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం వేట ప్రారంభించారని తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించినా పోటీ మాత్రం ప్రధానంగా అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రత్యర్ధి నాయకులపై ఘాటైన విమర్శలు చేస్తూ రాజకీయాలని వేదేక్కిస్తున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నువ్వా, నేనా అన్న రీతిలో టిఆర్ఎస్, బిజెపి మధ్య ప్రచారం జోరండుకుంటుంది. మరి ఓటరు ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి జై కొడతాడు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. 

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   3 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   4 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   16-10-2021


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

   14-10-2021


మంత్రి ఎర్రబెల్లిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు.. నీకు ఎంత మంది తండ్రులు అంటూ..

మంత్రి ఎర్రబెల్లిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు.. నీకు ఎంత మంది తండ్రులు అంటూ..

   13-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle