బండి సంజయ్.. ఏమై పోయినవ్
21-03-202121-03-2021 09:06:06 IST
2021-03-21T03:36:06.546Z21-03-2021 2021-03-21T03:35:46.310Z - - 16-04-2021

పాపం బండి సంజయ్. రంకెలేస్తే ఇలాగే ఉంటుంది. ఏదో కాస్త స్పీడ్ పెరిగింది కదా అని.. నాకంటే మొనగాడే లేడు అనుకుంటే ఎంత వరకు కరెక్ట్ చెప్పండి. ప్రజలు అలా చూస్తూ ఉండరు. బ్రేకులేసేస్తారు. ప్రత్యర్థులు కూడా అంతే.. ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు కదా. వారి ప్లాన్స్ వారికుంటయ్.. టైం చూసి దెబ్బ కొడితే.. ఎలా ఉంటుందో ఇప్పుడు బండి సంజయ్ కి తెలిసే ఉంటుంది.
సీఎం కేసీఆర్ అంటే ఎవరు చెప్పండి. ఢిల్లీ పెద్దల్నే గడ గడలాడించి.. తెలంగాణ జనాన్ని మొత్తాన్ని ఏకం చేసి.. తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ సీఎం కేసీఆర్. ఏదో లక్ లో ఒక సీటు గెలిచి.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో గ్రేటర్ లో నాలుగు సీట్లు గెలిచినంత మాత్రాన.. ఎదురే లేదు అనుకోవడం బండికి కూడా కరెక్ట్ కాదు అని.. మొదట్నుంచే జనంలో ఉంది. కేసీఆర్ రాజకీయ తంత్రాల ముందు.. బండి సంజయ్ ఆవేశం నిలవకపోవచ్చు అనుకున్నారు. కానీ.. బండి సంజయ్ మీద, బీజేపీ మీద ఏవో కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఉన్నయ్ జనాలకి. వాటన్నీటినీ బ్రేక్ చేసింది టీఆర్ఎస్.
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ లో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ లీడరే. ఆయనపై పీవీ కుమార్తె వాణీ దేవిని ఫైట్ కి నుంచోబెడితే అందరూ ఓడిపోవడం గ్యారంటీ అనుకున్నారు. కానీ.. కేసీఆర్ వ్యూహాలతో ఆమె విజయం సాధించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాల్లో కోదండరామ్, మల్లన్న బలంగా ఉన్నారు. అయినా సరే.. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. కానీ.. పల్లారాజేశ్వర్ రెడ్డికి మాత్రం గట్టి పోటీ ఇచ్చారు మల్లన్న. ఏ పార్టీ సపోర్ట్ లేకుండానే గెలుపు దాకా వచ్చారు. ఒకానొక దశలో మల్లన్నే గెలుస్తారు అని కూడా అనుకున్నారు. కానీ.. మొత్తానికైతే.. టీఆర్ఎస్ బయటపడింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకుంది. టీఆర్ఎస్ కార్ స్పీడ్ ముందు.. బీజేపీ బండి స్పీడ్ గెలవలేదు అని ప్రూవ్ అయింది.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
38 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా