newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

17-04-202117-04-2021 08:07:28 IST
Updated On 17-04-2021 09:31:38 ISTUpdated On 17-04-20212021-04-17T02:37:28.945Z17-04-2021 2021-04-17T02:36:44.660Z - 2021-04-17T04:01:38.797Z - 17-04-2021

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌ర‌గండి. జ‌ర‌గండి. మేం మీకోసం కాదు దీక్ష చేస్తున్న‌ది అంటూ.. ఎంతో క్లారిటీ ఉంటారు ష‌ర్మిల‌క్క‌. పార్టీ పెట్ట‌క‌ముందే దీక్ష‌లు మొద‌లుపెట్టి.. సీఎం ఉద్యోగం కోసం.. నిరుద్యోగం అనే అజెండా ఎత్తుకుని బానే క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రి ష‌ర్మిల‌క్క చేస్తున్న‌దేంటి. స‌రే.. మీ ఉద్యోగం మీ ఇష్టం మీ క‌ష్టాలు మీవి. కాద‌నం కాద‌న‌లేం కూడా. కానీ.. మ‌రి రాష్ట్రంలో రూల్స్ గ‌ట్రా ఉన్న‌య్ క‌దా అక్క‌. బ‌హిరంగంగా ఉంటున్నారు. జ‌నాలు వ‌స్తున్నారు. క‌లుస్తున్నారు వెళ్తున్నారు. య‌ట్ లీస్ట్ మాస్కు త‌ప్ప‌ని స‌రి క‌దా అక్క‌.

అస‌లు ఈ స‌భ్య స‌మాజానికి ష‌ర్మిల‌క్క ఏం మెస్సేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఎవ‌రికీ అర్దం కాదు. రాజ‌న్న రాజ్యం తీసుకొస్తే తీసుకొద్దురు గానీ.. లేదంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీలాగా.. సీఎం కేసీఆర్ కి ఆయ‌న పార్టీకి మ‌ద్ద‌తు ఇద్దురు గానీ.. అవి మీకు సంబంధించిన ఎవ్వారాలు కానీ.. ముందు వ‌చ్చే పోయే జ‌నాలతో కాంటాక్ట్ అవుతున్నారు మీరు ఆ విష‌యం గుర్తుంచుకోవాలి క‌దా అంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు. ఒక‌రు వ‌స్తారు.. మీతో మాట్లాడ‌తారు.. మ‌ళ్లీ వెళ్తారు. వ‌చ్చిన వాళ్లు మీకు క‌రోనా అంటించారేమో ఎవ‌రికి తెలుసు. మ‌ళ్లీ వ‌చ్చిన వారికి ఆ క‌రోనాని మీరు అంటిస్తారేమో ఎవ‌రికి తెలుసు. అయినా.. సోష‌ల్ డిస్టెన్సింగ్ కూడా చాలా అవ‌స‌రం క‌దా అక్కా.

ఇక అరెస్ట్ లు ర‌చ్చ‌లు. తెలిసిన‌వే క‌దా. ఇక పాద‌యాత్ర చేస్తున్నాం అంటున్నారు. ఒక్క‌రూ మాస్క్ పెట్టుకోరు.. సోష‌ల్ డిస్టెన్ప్ పాటించ‌రు. శానిటైజేష‌న్ చేస్కోరు. ఏంద‌క్కా ఇది. ఓ ప‌క్క క‌రోనా వ‌చ్చి చ‌స్తుంటే.. స్కూల్స్ గ‌ట్రా బంద్ చేసుకుంటుంటే.. జాబులు మానేసి జ‌నాలు ఇళ్ల‌కాడ కూర్చుంటుంటే.. మీరేమో మీ ఉద్యోగం కోసం ఇలా చేస్తున్నారేంట‌క్కా అంటున్నారు పొలిటిక‌ల్ మేథావులు. చూస్కోండ‌క్కా.. ముందు రోజుల్లో.. ష‌ర్మిల దీక్ష‌లు..  ష‌ర్మిల యాత్ర‌లు క‌రోనాకి హాట్ స్పాట్ లు అనే పేరు రాకుండా చూస్కోండి. ఉద్యోగాల కోసం ఎలాగూ.. ఏళ్ల‌కేళ్లుగా వెయిట్ చేస్తున్నారు జ‌నాలు. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి కూడా ఊపిరి బిగ‌బ‌ట్టుకుని ఉండేలా చేయ‌మాకండి అంటున్నారు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle