newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

15-04-202115-04-2021 09:37:50 IST
2021-04-15T04:07:50.066Z15-04-2021 2021-04-15T04:07:46.922Z - - 15-05-2021

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కొత్త కరోనా వైరస్ తీవ్రత భయంకరంగా ఉందని, ప్రజలు బహిరంగ స్థలాల్లోనే కాకుండా ఇంటిలోపల కూడా తప్పకుండా మాస్క్ ధరించాలంటూ తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు రాష్ట్రంలో విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్ గాల్లోనే శరవేగంగా వ్యాపిస్తోందని, వచ్చే అయిదారు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇప్పటినుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇంటిలో కూడా మాస్క్ ధరించండి. మీరు ఇంటి బయటకు మాస్క్ ధరించి వెళ్లి తిరిగొచ్చాక ఇంట్లో మాస్క్‌ని తీసివేస్తే మీ ద్వారా వైరస్ మీ కుటుంబ సభ్యులకు కూడా అంటుకుని వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు.

గత నాలుగువారాలుగా తెలంగాణలో కోవిడ్-19 కేసులు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వచ్చే 4 నుంచి 6 వారాల దాగా ఇదే పరిస్థితి కొనసాగనుంది. పరిస్థితి ఇప్పుడున్నవిధంగానే కొనసాగినట్లయితే మన రాష్ట్రం కూడా మరో మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొందరు ప్రజలు ఆస్పత్రుల్లో పడకలు లేక అల్లాడుతున్నారు. ఇన్ఫెక్షన్ రేటు ఇలాగే కొనసాగితే, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడే అవకాశముంది అని డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఇంట్లో ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లయితే మొత్తం కుటుంబ సభ్యులు ఒకటి లేదా రెండు రోజుల్లోపే వైరస్ బారిన పడే అవకాశముంది. కరోనా కొత్త వైరస్ గాల్లోనుంచే వ్యాప్తిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కర్ఫ్యూ కానీ, లాక్ డౌన్ కాని ఇతర కఠిన ఆంక్షలు కానీ విదించే ఉద్దేశంతో లేనప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం తీవ్రాతితీవ్రంగా ఉందని శ్రీనివాస రావు హెచ్చరించారు.

ప్రజలు ఇప్పటికైనా స్వీయ నియంత్రణలు, స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుత కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని డాక్టర్ రావు పేర్కొన్నారు.

బుధవారం తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన వైద్య బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 2,157 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిమంది రోగులు చనిపోగా, మొత్తం యాక్టివ్ కేసులు 25,459కి చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 361 కేసులు నమోదు కాగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు వరుసగా 245, 206 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

 

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   10 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   21 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle