newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీఆర్ఎస్ అధినేతపై రాములమ్మ కౌంటర్లే.. కౌంటర్లు

09-02-202109-02-2021 21:58:55 IST
Updated On 09-02-2021 10:47:41 ISTUpdated On 09-02-20212021-02-09T16:28:55.561Z09-02-2021 2021-02-09T04:35:13.211Z - 2021-02-09T05:17:41.410Z - 09-02-2021

టీఆర్ఎస్ అధినేతపై రాములమ్మ కౌంటర్లే.. కౌంటర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ జరిగిన ప్రచారానికి కేసీఆర్ తాజాగా ఎండ్ కార్డు వేసిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం బాగా ఉందని, మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, సీఎం మార్పు అంటూ ప్రచారం చేయొద్దని సొంత పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. ఈ కథనాలపై బీజేపీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పినందుకు సంతోషం అని..  వీరి పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యమే ఆందోళనకరంగా తయారైందని కౌంటర్లు వేశారు. అధికార పార్టీ దోపిడీలతో సామాన్య ప్రజల జీవన పరిస్థితులే ప్రమాదంలోకి పడిపోతున్నాయని ఆరోపించారు.

సీఎం పదవికి దళిత బిడ్డలను మోసగించి, వారసునికెట్లా కట్టబెడతావని ప్రజలు, బీజేపీ నిలదీస్తుండడంతో భయపడి 10 ఏళ్లు నేనే సీఎం అంటూ మాయ మాటలు చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని విజయశాంతి చెప్పుకొచ్చారు. మబ్బుల మాటున ఉండే వానాకాలపు సూర్యుడిలా మరో పదేళ్ల పాటు ఎప్పుడు ప్రగతిభవన్ లో కనిపిస్తాడో, ఎప్పుడు ఫాంహౌస్ లో దర్శనమిస్తాడో అర్థంకాని అయోమయంలో జనం తననే భరించాలని చెబుతున్నట్లుగా ఉందని ఆమె అన్నారు. పదేళ్ల వరకు ఎందుకు... కేసీఆర్ కారు మబ్బుల్ని తెలంగాణ ప్రజలు మరో మూడేళ్లలోనే చెదరగొడతారని ఆయన అర్థం చేసుకునే రోజులు దగ్గరపడుతున్నాయని విజయశాంతి చెప్పుకొచ్చారు. 

తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నేతలను బండకేసి కొడతానని, పార్టీ నుంచి వెళ్లగొడతానని తిట్టారని.. సీఎం పదవి తన ఎడం కాలి చెప్పుతో సమానం అని చెప్పడం విడ్డూరం అని, అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? అని వ్యాఖ్యానించారు. సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత అసహనం వ్యక్తం చేస్తున్న కేసీఆర్... అయోధ్య గురించి, ఉద్యోగుల గురించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తే కనీసం ఖండించడం లేదని అన్నారు. 

టీఆర్ఎస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయని, అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లు చేపట్టిన ఘనత కేసీఆర్ దేనని విజయశాంతి ఆరోపించారు. కుట్రలు, అబద్ధపు ప్రచారాలతో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారని, ఆపై తెలంగాణ ఐక్యత పేరుతో చర్చలంటూ ఆ పార్టీలను విలీనం చేశారని.. ఇప్పుడా పార్టీలనే లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ కాదు.. సీఎం ఈటెల‌

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle