newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

19-04-202119-04-2021 12:08:18 IST
Updated On 19-04-2021 12:46:13 ISTUpdated On 19-04-20212021-04-19T06:38:18.556Z19-04-2021 2021-04-19T06:33:54.643Z - 2021-04-19T07:16:13.099Z - 19-04-2021

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 4,009 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. ఒక్క‌రోజులో కరోనాతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,878 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,14,441 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,838గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 39,154 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 705 మందికి క‌రోనా సోకింది. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణలో కొవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. 

'ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు... బులిటెన్ ద్వారా ప్రకటిస్తున్న ఫలితాలు... వాస్తవ గణాంకాలకు ఏ మాత్రం పొంతన లేదని ఆ నివేదికలు ఆధారాలతో సహా విశ్లేషించాయి. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి... ప్రభుత్వ వర్గాల అంకెలు వందల్లో ఉంటే వాస్తవ పరిశోధన ప్రకారం ఈ కేసులు వేలల్లో కనిపిస్తున్నాయి. గతేడాది ప్రభుత్వ వెబ్ సైట్‌లో కరోనా కేసుల గణాంకాలను కొన్నాళ్లు అప్‌డేట్ చెయ్యకుండా ఆపేస్తే హైకోర్టు మందలింపుల తర్వాత మళ్లీ కొనసాగించారు' అని విజ‌య‌శాంతి గుర్తు చేశారు. 

'ఈ వ్యవహారం ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నట్టు అప్పట్లో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఒక కోణమైతే... పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులు నరకానికి నకళ్లుగా ఉన్నాయి' అని విజ‌య‌శాంతి విమర్శించారు. 'కరోనా అనుమానితులు, అరోగ్యంగా ఉన్నవారు... రకరకాల వ్యాధిగ్రస్థులు... అందరినీ గుంపులుగా గంటల తరబడి భౌతిక దూరం, శానిటైజేషన్, ఇతర జాగ్రత్తలేవీ లేకుండా ఒకేచోట నిలబెట్టి టెస్టులు చేస్తున్నారు. ఇదెంత ప్రమాదకరమో పాలకులకు తెలియదా? ప్రజారోగ్యాన్ని పక్కనపడేసి, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ఈ పాలకుల పట్టింపులేనితనమే వారి పతనానికి నాంది' అని విజ‌య‌శాంతి విమర్శించారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle