newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

25-10-202025-10-2020 17:51:25 IST
Updated On 25-10-2020 17:54:18 ISTUpdated On 25-10-20202020-10-25T12:21:25.102Z25-10-2020 2020-10-25T12:21:22.689Z - 2020-10-25T12:24:18.312Z - 25-10-2020

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఒక్కసారంటే ఒక్కసారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడిస్తే చాలు తాను గతంలో ఇచ్చిన హామీలన్నీ దెబ్బకు కేసీఆర్‌కి గుర్తొస్తాయనంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర, ఉద్యోగులకు డీఏ ఇస్తామంటూ ఆయన ప్రకటించడం దుబ్బాక ప్రజల నైతిక విజయమని ఉత్తమ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

‘‘ఇటీవల కుక్క తోక అంటూ ఉద్యోగుల పట్ల అవహేళనగా మాట్లాడిన కేసీఆర్‌.. ఇప్పుడు డీఏ ప్రకటించారు. మొక్కజొన్న పంట వేయొద్దన్న ఆయన.. గ్రా మాల వద్దకు వచ్చి రూ.1,850 ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులు, ఉద్యోగులకు హామీలు అమలు చేసిన కేసీఆర్‌.. దుబ్బాకలో ఓడగొడితే అన్నీ చేస్తాడు. గతంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి. అదే కారు గుర్తును గెలిపిస్తే ఎన్నికలయ్యాక మోసం చేస్తారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అవుతుంది’’ అని ఉత్త మ్‌ అన్నారు. 

కాగా కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన చట్టంతో వ్యవసాయ రంగం కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. 

‘‘ఒవైసీ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీని ఎంఐఎం అధినేత ఒవైసీ.. నడి చెరువులో కట్టారు. సినీ హీరో నాగార్జున.. చెరువును కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించారు. వీళ్లను టచ్‌ చేసే ధైర్యం మంత్రి కేటీఆర్‌కు ఉందా’’ అని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఏఐసీసీ కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం వరద నష్టంపై శాస్త్రీయంగా పరిశోధన చేయలేదన్నారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   8 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   9 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   10 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   10 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   10 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   11 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   11 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   12 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle