newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

29-09-202029-09-2020 13:48:58 IST
2020-09-29T08:18:58.798Z29-09-2020 2020-09-29T08:18:56.650Z - - 25-10-2020

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ తమకు చెల్లించాల్సిన రూ. 70 కోట్ల రూపాయల చమురు బకాయిలను చెల్లంచకపోతే చమురు సరఫరా నిలిపేస్తామని చమురు విక్రయ సంస్థలు హెచ్చరించాయి. ఇప్పటికే ఒకటి రెండు రోజులు చమురు నిలిపివేయడంతో ఇప్పుడిప్పుడే సర్వీసులు పెంచుకుంటున్న ఆర్టీసీకి కొత్తం గండం మొదలైంది. ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో రెండు నెలలుగా చమురు సంస్థలకు డీజిల్‌ తాలూకు పూర్తి బిల్లులు చెల్లించలేక పోతోం ది. దీంతో దాదాపు రూ.70 కోట్ల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో చమురు సంస్థలు బిల్లుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. 

ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో చమురు సరఫరాను నిలిపేయనున్నట్లు ఆ సంస్థలు హెచ్చరిం చాయి. ఒకట్రెండు రోజులు నిలిపేశాయి కూడా. దీంతో ఆర్టీసీలో ఆందోళన మొదలైంది. చమురు సంస్థల ప్రతినిధులతో చర్చించి కొంతమేర చెల్లిం చేందుకు సిద్ధమయ్యింది. దీంతో తాత్కాలి కంగా సరఫరాను ఆయా సంస్థలు పునరుద్ధరిం చాయి. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లించే హామీతో సరఫరా ను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఆలోగా డబ్బు లు చెల్లించకుంటే డీజిల్‌ సరఫరాను ఆపేయను న్నట్టు ఆయిల్‌ కంపెనీలు హెచ్చరించాయి. 

లాక్‌డౌన్‌తో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి ఆదాయం లేకుండా పోయింది. దాదాపు రెండున్నర నెలలు చిల్లిగవ్వ ఆదాయం లేదు. మే చివరలో జిల్లా బస్సు సర్వీసులు మొదలైనా కరో నా కేసుల తీవ్రత కారణంగా జనం బస్సులెక్కేందుకు భయపడ్డారు. ఆక్యుపెన్సీ రేషియో 25 శాతంగా ఉండటంతో నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత పక్షం రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 55 శాతానికి చేరడంతో రోజువారీ ఆదాయం రూ.4 కోట్లను మించుతోంది. మూడు రోజుల క్రితం సిటీ బస్సులు ప్రారంభమయినా.. పావు శాతమే తిరుగుతుండటంతో రూ.30 లక్షల ఆదాయం ఉంటోంది. కార్గో బస్సుల రూపంలో రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇవి తప్ప ఆర్టీసీ వద్ద వేరే నిధులు లేకపోవటంతో చమురు బకాయిలు తీర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 

ప్రస్తుతం ఆర్టీసీ నిత్యం 16.6 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతోంది. దీనికి 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చవుతోంది. గతంలో ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఉండేది. ఇప్పుడు రోజుకు కొంతమేర మాత్రమే చెల్లిస్తున్నా రు. దీంతో ఎక్కువ మొత్తం పేరుకుపోతూ రూ.70 కోట్లకు బకాయి చేరుకుంది. 

ఆర్టీసీకి ఇతర ఆదాయం లేకపోవటంతో చమురు కంపెనీలు కూడా ఆలోచనలో పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనట్టు ఒత్తిడి పెంచి, ఆర్టీసీ చరిత్రలో తొలిసారి చమురు సరఫరాను నిలిపివేయటం లాంటి సీరియస్‌ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కారణంగానే ఆదాయం పెంపునకు సిటీలో ఆగమేఘాల మీద బస్సు సర్వీసులు ప్రారంభించాల్సి వచ్చింది. క్రమంగా వీటి సంఖ్యను పెంచుతూ ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ వేళ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించలేదని చమురు సరఫరా నిలిపివేసేలా ఆ సంస్థలు వ్యవహరించటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చమురు కంపెనీలకు అతిపెద్ద వినియోగదారు ఆర్టీసీనే. నిత్యం లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగించే ఆర్టీసీ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఇటీవల స్వయంగా ఆర్టీసీ సొంతంగా పెట్రోలు బంకులు స్థాపించి చమురు కంపెనీలకు డీలర్‌గా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజా సేవలో ఉండే ఆర్టీసీ విషయంలో కంపెనీలు దయతో వ్యవహరించాలని పేర్కొంటున్నారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle