newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఎమ్మెల్సీ పోరు.. కోదండరాం టార్గెట్‌గా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్!

25-09-202025-09-2020 13:52:47 IST
Updated On 25-09-2020 14:57:18 ISTUpdated On 25-09-20202020-09-25T08:22:47.405Z25-09-2020 2020-09-25T08:22:44.975Z - 2020-09-25T09:27:18.652Z - 25-09-2020

ఎమ్మెల్సీ పోరు.. కోదండరాం టార్గెట్‌గా టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల కోసం దాదాపు ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సహజంగానే పట్టభద్రుల ఎన్నికలలో రాజకీయ పార్టీల అవసరం అంతంత మాత్రమే అయినా చివరికి ఈ ఎన్నికలలో కూడా రాజకీయాలు అంతర్భాగమై పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారడంతో ఈ ఎన్నికలు సైతం సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పావులు కదపడం మొదలు పెట్టింది. సహజంగానే ప్రతి ఎన్నికలకు సారధిగా మారే మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికలకు కసరత్తులు మొదలుపెట్టారు.

ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్త ఓటర్ల నమోదు, పాత జాబితాలో సవరణకు సాధారణ అంశమే కాగా ఈ ఎన్నికలకు ఓటర్ల జాబితా కసరత్తులు పలు పార్టీలు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే షాడో సీఎంగా పేరున్న మంత్రి కేటీఆర్ సమీక్షలు మొదలుపెట్టారు. ఇప్పటికే జిల్లాల నుండి పంచాయతీల వరకు ఇంచార్జిలను నియమించిన టీఆర్ఎస్ పార్టీ గెలుపే టార్గెట్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తుంది.

ఈ స్థానంపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం వెనుక టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా కనిపిస్తుంది. నిజానికి ఈ వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల నుంచి పట్టభద్రుల ప్రతినిధిగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం శాసనమండలిలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరారు. కోదండరాం సభలో అడుగుపెడితే సబ్జెక్టు పరంగా ప్రభుత్వానికి చిక్కులు తప్పవని భావన టీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక వ్యక్తిగా నడుచుకున్న కోదండరాంపై ప్రజలలో మైలేజీ దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కోదండరాం గెలుపు ప్రభుత్వానికి చిక్కులుతో పాటు ప్రజలలో టీఆర్ఎస్ వ్యతిరేకత అనే భావన కూడా ఏర్పడుతుంది. అందుకే టీఆర్ఎస్ కోదండరాంను టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది. స్వతహాగా ప్రొఫెసర్ అయిన కోదండరాంకు పట్టభద్రులలో మంచి అభిప్రాయమే ఉంటుంది. పైగా ఉమ్మడి వరంగల్ స్థానంలో అయనకు బలం ఎక్కువ. అలాంటిది అయనను ఢీ కొట్టాలంటే ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంది. ఆ ప్రయత్నమే కేటీఆర్ ఇప్పుడు మొదలుపెట్టారు. మరి ఫలితం ఎలా ఉంటుందో అక్టోబర్ వరకు ఆగాల్సిందే!


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle