newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

07-12-202107-12-2021 08:13:06 IST
Updated On 07-12-2021 11:55:25 ISTUpdated On 07-12-20212021-12-07T02:43:06.162Z07-12-2021 2021-12-07T02:42:59.710Z - 2021-12-07T06:25:25.002Z - 07-12-2021

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ రాజీనామా చేశారు. ఎంపీ బండ ప్రకాష్‌ను సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి అందజేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సీటుకి రాజీనామా ఆమోదం అనంతరం బండ ప్రకాష్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మూడేళ్ల కిందట 2018 ఏప్రిల్‌లో బండ ప్రకాష్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2024 ఏప్రిల్ వరకూ పదవీకాలం ఉండగానే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభ ఎంపీ సీటుకు ఎన్నిక అనివార్యం కానుంది. బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో రాజ్యసభ సీటును సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా కవిత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌‌లో చేరిన సీనియర్ నేతలతో పాటు సీఎంకు అత్యంత సన్నిహితులు రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ వినోద్ కుమార్, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, ఇటీవల బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురిలో రాజ్యసభ ఎవరికి వరిస్తుందో అన్నది సస్పెన్స్ గా మారింది.

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్‌

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్‌

   5 hours ago


పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ ఎంపిక... టెలివోట్‌లో 93% స్కోర్

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ ఎంపిక... టెలివోట్‌లో 93% స్కోర్

   8 hours ago


కొడాలి నానిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు

కొడాలి నానిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు

   10 hours ago


కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్‌

కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్‌

   13 hours ago


పంజాబ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ.. మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి మేనల్లుడు

పంజాబ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ.. మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి మేనల్లుడు

   14 hours ago


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్

   17 hours ago


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్

   17-01-2022


ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

   15-01-2022


విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

   14-01-2022


తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్‌ జగన్‌

తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్‌ జగన్‌

   14-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle