పీవీ నరసింహా రావు కుమార్తెకు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ
22-02-202122-02-2021 08:02:02 IST
Updated On 22-02-2021 10:33:43 ISTUpdated On 22-02-20212021-02-22T02:32:02.065Z22-02-2021 2021-02-22T02:31:58.014Z - 2021-02-22T05:03:43.330Z - 22-02-2021

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే పలు పార్టీలు అందుకు సంబంధించిన కసరత్తులు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందుకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. ఆమె నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికల బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన టీఆర్ఎస్.. రెండోస్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఊహాగానాలు షికార్లు చేశాయి. గతంలోనూ ఇక్కడ గెలవకపోవడంతో పోటీ నుంచి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు విశ్లేషణలు చేశారు. ఇక్కడ పోటీలో నిలిచిన మరో అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్కి పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా బీజేపీని దెబ్బ కొట్టేందుకు వ్యూహం రచించినట్లు చర్చ నడిచింది. వాటన్నింటికీ సీఎం కేసీఆర్ ఫుల్స్టాప్ పెట్టారు. అనూహ్యంగా పీవీ కుమార్తెను బరిలోకి దింపారు. ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను కొద్దిరోజుల కిందట విడుదల చేసింది. మార్చి 14వ తేదీన ఎన్నికలు పెడుతున్నట్టు ప్రకటించింది. 17వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మార్చి 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 16 (మంగళవారం) న రానుండగా.. నామినేషన్లకు గడువును ఫిబ్రవరి 23 (మంగళవారం)గా నిర్ణయించారు. ఇక నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24 (బుధవారం)గా గుర్తించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 26 (శుక్రవారం)గా నిర్ణయించారు. పోలింగ్ తేదీ, సమయాన్ని మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం)గా నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలను మార్చి 17 (బుధవారం)న విడుదల చేయనున్నారు.

సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై శివసేన ధ్వజం
2 hours ago

బీజేపీకి విషమ పరీక్ష
4 hours ago

విశాఖ ఉక్కు సా‘గరం’
4 hours ago

కుప్పం పర్యటనలో చంద్రబాబుకు షాక్.. మాకు జూనియర్ ఎన్టీఆర్ కావాలి
18 hours ago

చేపలు పట్టడమెలాగో తెలుసుకున్నా.. ఎంతకష్టమో అర్థమైంది.. రాహుల్ గాంధీ
19 hours ago

మున్సిపల్ ఎన్నికలకు నో డిలే..!
20 hours ago

బెంగళూర్ లో చక్రం తిప్పుతున్న షర్మిల
16 hours ago

కొత్త పేపర్, కొత్త ఛానల్.. షర్మిల ఫస్ట్ ఫోకస్
21 hours ago

మమత, కేజ్రీవాల్ లు.. మోడీకి చెక్ పెడతారా
15 hours ago

గంటా స్పీడ్.. బీజేపీకి బ్యాడ్
26-02-2021
ఇంకా