newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

MLC Elections: బీజేపీ, కాంగ్రెస్ దూకుడు.. సైలెంట్ మోడ్‌లో టీఆర్ఎస్!

13-02-202113-02-2021 16:05:10 IST
Updated On 13-02-2021 16:06:59 ISTUpdated On 13-02-20212021-02-13T10:35:10.638Z13-02-2021 2021-02-13T07:24:20.949Z - 2021-02-13T10:36:59.546Z - 13-02-2021

MLC Elections: బీజేపీ, కాంగ్రెస్ దూకుడు.. సైలెంట్ మోడ్‌లో టీఆర్ఎస్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో గడువు పూర్తి కాబోతోంది. తెలంగాణలో మహబూబ్ నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వరంగల్– ఖమ్మం– నల్గొండకు టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏపీలో తూర్పు–పశ్చిమ గోదావరి నియోజకవర్గం నుంచి రాము సూర్యారావు, కృష్ణా–గుంటూరు నియోజకవర్గం నుంచి ఎ.ఎస్. రామకృష్ణలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 14వ తేదీన ఎన్నికలు పెడుతున్నట్టు ప్రకటించింది. 17వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మార్చి 22 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 16 (మంగళవారం) న రానుండగా.. నామినేషన్లకు గడువును ఫిబ్రవరి 23 (మంగళవారం)గా నిర్ణయించారు. ఇక నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24 (బుధవారం)గా గుర్తించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 26 (శుక్రవారం)గా నిర్ణయించారు. పోలింగ్ తేదీ, సమయాన్ని మార్చి 14 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం)గా నిర్ణయించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలను మార్చి 17 (బుధవారం)న విడుదల చేయనున్నారు. 

అభ్యర్థుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నా టీఆర్ఎస్ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకచోట క్లారిటీతో ఉన్న టీఆర్‌ఎస్‌, రెండోచోట మాత్రం కన్ఫ్యూజన్ లో ఉంది. అసలు సొంత అభ్యర్థి బరిలో ఉంటారా లేక మరో ఆలోచనలో ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ది పై టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చ నడుస్తుంది.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ని టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించింది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు ఆయన. మరో ఎమ్మెల్సీ అభ్యర్ది పై మాత్రం సైలెంట్ గా ఉంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేశారు. అయినా విజయం సాధించలేకపోయారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతూ ఉండగా.. టీఆర్ఎస్ మాత్రం కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle