newssting
Radio
BITING NEWS :
రెండ్రోజుల్లో రామతీర్థానికి రానున్న విగ్రహాలు. టీటీడీ ఆధ్వర్యంలో సుందరంగా తయారవుతున్న విగ్రహాలు. * చెన్నైలోని క్రైస్తవ ప్రచారకుడి ఇంటిపై ఐటీ దాడులు. పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న అధికారులు. చెన్నై కోయంబత్తూర్ సహా 28 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు. * అమెరికా అధ్యక్షుడి స్థానంలో చివరిసారిగా ప్రసంగించిన ట్రంప్. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలన్న ట్రంప్. ప్రజలకు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్న ట్రంప్. * అమెరికా 46వ అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం. ఉపాధ్యక్షురాలిగా అచ్చమైన భారతీయ వనితగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్. * అమరావతి ఉద్యమం చేపట్టి 400 రోజులు అయిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా. గొల్లపూడిలో సభలు, దీక్షలకు అనుమతి లేదన్న పోలీసులు. * అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ విరాళాల సేకరణ. విరాళాల సేకరణ కోసం మిగతా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న బీజేపీ నేతలు. బోరబండ నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన బండి సంజయ్.

ఆ పెద్దాయ‌న‌కే టీపీసీసీ ప‌గ్గాలు..! కానీ ఓ కండీష‌న్‌..!

11-01-202111-01-2021 16:29:33 IST
2021-01-11T10:59:33.007Z11-01-2021 2021-01-11T06:31:59.194Z - - 20-01-2021

ఆ పెద్దాయ‌న‌కే టీపీసీసీ ప‌గ్గాలు..! కానీ ఓ కండీష‌న్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. అదికాస్తా ముదిరి సొంత పార్టీ నేత‌ల‌పైనే ఇప్పుడు బ‌హిరంగ మాట‌లదాడికి దిగేవ‌ర‌కు ఆ పార్టీలోని కొంద‌రు వెళ్తున్నారు. టీపీసీసీ అధ్య‌క్ష స్థానం విష‌యంలో ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటుండ‌గా.. ప్ర‌తిప‌క్షాలు ఎంజాయ్ చేస్తుంటే.. ఆ పార్టీ శ్రేణులు మాత్రం వీరు మార‌రు అని ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చేశాయి. రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డిల‌లో ఎవ‌రికైనా ఒక‌రికి టీపీసీసీ పీఠం అప్ప‌గించేందుకు కేంద్ర పార్టీ పెద్ద‌లు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో పార్టీలో అంత‌ర్గ‌త విబేధాలు కాస్తా బ‌హిరంగంగా మార‌డంతో అధ్య‌క్షుడి ఎంపిక‌పై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. 

రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే తాము పార్టీని వీడుతామ‌ని కొంద‌రు నేత‌లు అధిష్టానం వ‌ద్ద ఖ‌రాఖండీగా చెప్ప‌డంతో.. కోమ‌టిరెడ్డి వైపు కేంద్ర పార్టీల పెద్ద‌లు మొగ్గుచూపారు. కానీ అక్క‌డ కొంద‌రు నేత‌లు అడ్డుత‌గ‌ల‌డంతో టీపీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక వాయిదాప‌డుతూ వ‌స్తుంది. అంద‌రిని స‌మ‌న్వ‌యం చేసే నేత‌కు, ఎవ‌రికి అభ్యంత‌రం లేని నేత‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు అధిష్టానం పెద్ద‌లు దృష్టిసారించ‌గా.. జీవ‌న్‌రెడ్డి అయితే క‌రెక్ట్ అని భావించారు. అయితే జీవ‌న్‌రెడ్డి అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకొనేందుకు వెన‌క‌డుగు వేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. 

ఈ క్ర‌మంలో పార్టీలో సీనియ‌ర్ నేత‌కే టీపీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని అధిష్టానం ఫైన‌ల్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అదికూడా నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక పూర్త‌య్యాక‌నే ఎంపిక ఉంటుంద‌ని రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి ఠాకూర్ పేర్కొన్న‌ట్లు ఆ పార్టీలోని ప‌లువురు నేత‌లు పేర్కొంటున్నారు. నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక బ‌రిలో జానారెడ్డిని నిలిపేందుకు అధిష్టానం ఇప్ప‌టికే నిర్ణ‌యించింది. అందుకు తొలుత జానారెడ్డి స‌సేమీరా అన్నా.. చివ‌రికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌టంతో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డే అని తాత్కాలిక టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. 

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు, టీపీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక‌కు కేంద్ర పార్టీ అధిష్టానం ముడిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ఫ‌లితాల అనంత‌రం అధ్య‌క్షుడిని నిర్ణ‌యిస్తామ‌ని, అదీ పార్టీలోని సీనియ‌ర్ నేత‌కు, అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన నేత‌కే అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని కేంద్ర పార్టీ పెద్ద‌లు రాష్ట్ర పార్టీ నేత‌ల వ‌ద్ద స్ప‌ష్టం చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. జీవ‌న్‌రెడ్డి ఎలాగూ టీపీసీసీ చీఫ్ రేసుకు దూరంగా ఉండ‌టంతో.. జానారెడ్డికే టీపీసీసీ అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని అధిష్టానం యోచిస్తున్న‌ట్లు ఆ పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

అయితే అక్క‌డ ఓ కండీష‌న్ ఉంద‌ట‌. త్వ‌ర‌లో నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో జానారెడ్డి గెలిస్తే.. వెంట‌నే ఆయ‌న పేరును టీపీసీసీ చీఫ్ ప‌ద‌వికి ప్ర‌క‌టించేందుకు కేంద్ర పార్టీ పెద్ద‌లు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఒక‌వేళ ఓట‌మిపాలైతే పార్టీలోని వేరే సీనియ‌ర్ నేత‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని భావిస్తున్నార‌ట‌. మొత్తానికి కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో కేంద్ర పార్టీ పెద్ద‌లు క‌చ్చిత‌మైన నిర్ణ‌యానికి రాలేక పోతుండ‌టంతో పార్టీ శ్రేణులు నిరాస‌కు లోన‌వుతున్నారు. ప‌లువురు నేత‌లైతే ఇక ఈ పార్టీలో మార్పురాద‌నే భావ‌న‌తో ప‌క్క పార్టీవైపుసైతం చూస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

పార్లమెంట్ క్యాంటీన్‌లో సబ్సిడీలు ఇక చెల్లవ్.. లోక్‌సభ స్పీకర్

పార్లమెంట్ క్యాంటీన్‌లో సబ్సిడీలు ఇక చెల్లవ్.. లోక్‌సభ స్పీకర్

   3 minutes ago


సహ నిందితురాలికి ప్రమోషన్ ఇచ్చేసిన సీఎం జగన్

సహ నిందితురాలికి ప్రమోషన్ ఇచ్చేసిన సీఎం జగన్

   20 minutes ago


జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి

   2 hours ago


కేటీఆర్ ప‌రిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా

కేటీఆర్ ప‌రిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా

   5 hours ago


జ‌గ‌న్ స‌ర్కార్ మరో డెసిష‌న్.. ఎందుకు తీసుకుంటారో ఏమో

జ‌గ‌న్ స‌ర్కార్ మరో డెసిష‌న్.. ఎందుకు తీసుకుంటారో ఏమో

   3 hours ago


సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా

   5 hours ago


నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే

   6 hours ago


ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?

   6 hours ago


షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!

   7 hours ago


ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట

   8 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle