డ్రగ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు
03-04-202103-04-2021 11:06:15 IST
Updated On 03-04-2021 11:17:25 ISTUpdated On 03-04-20212021-04-03T05:36:15.236Z03-04-2021 2021-04-03T05:35:29.489Z - 2021-04-03T05:47:25.177Z - 03-04-2021

ఒక్క సినీ ఆర్టిస్ట్ దొరికితే చాలు. పోలీసులు ఆగనంటే ఆగరు. దుమ్ము దులిపేస్తారు. మీడియాని తీసుకెళ్లి నానా హడావిడి చేస్తారు. సెకన్ సెకన్ కీ అప్డేట్ ఇస్తూ.. ఆ హీరో.. ఈ హీరో.. ఆ హాట్ బేబీ ఈ హాట్ బేబీ అంటూ.. అబ్బో మామూలు కతలు కావు. కానీ.. బెంగళూరు డ్రగ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారట. వారికి లింక్స్ ఉన్నట్లు ఫుల్ క్లారిటీ ఉందంట. కానీ.. ఏ మాత్రం హడావిడి లేదు. ఏదో గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్లు అవుతున్నట్లుంది అనే టాక్ స్టార్ట్ అయింది. సింపుల్ గా మాట్లాడుకుంటే.. బెంగళూరులో దొరికిన నాలుగు కోట్ల విలువైన డ్రగ్ కేసు అందరి మెడకీ చుట్టుకుంటోంది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. లింకులు వెతుకుతున్నారు. అక్కడ ఇండస్ట్రీతో పాటు.. మన ఇండస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయింది. మోస్తారుగా ఓ స్టార్ డమ్ ఉన్న హీరోకి మెయిన్ లింక్ తగులుతోందంట. అలాగే.. ఉద్యమ కారుడిగా చెప్పుకునే ఓ బడా లీడర్ మెడకి బానే చుట్టుకునేలా ఉందంట. ఆయన డ్రగ్స్ ని కూడా ఉద్యమంలా నడిపిస్తున్నాడు అనే టాక్ త్వరలోనే బయటికి రానుందంట. ఇక పోతే.. హీరో.. బడా లీడర్ తో పాటు.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా లింక్ ఉందంట. ఆ ఉద్యమ లీడర్ నుంచి.. ఈ ఎమ్మెల్యేలకు లింక్స్ ఉన్నాయట. అలా అలా అందరూ అంటే.. ఓ ఐదుగురు సెలబ్రిటీలు బెంగళూరు డ్రగ్స్ కేసులో పీకల్లోతు మునిగిపోయారట. ఇప్పుడిప్పుడే మెల్లగా తీగ కదులుతోందంట. డొంక మొత్తం కదిలి.. ఎంత మంది లీడర్లకి.. ఎంత మంది హీరోలకి చుట్టుకుంటుందో తెలియడానికి.. ఇంకెంత టైం పట్టదు అంటున్నారు పోలీసులు. తెలంగాణలో పెరిగిన కులాల కంపు.. పోషిస్తోన్న పార్టీలు అయితే.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారు అయ్యి ఉంటారు అనేది కూడా ఇంట్రస్టింగ్ గానే మారింది. మరి తెలంగాణలో ఇంకే పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారులే అంటూ మాట్లాడుకుంటున్నారు. ఉద్యమ లీడర్ కి లింక్ అయ్యి ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అంటే.. ఊహించుకోవచ్చు. అసలు ఊహించుకోవాల్సిన అవసరం ఏముంది.. అనుకోవాల్సిన అవసరం ఏముంది.. నాల్రోజుల్లో క్లారిటీస్ వస్తయ్ కదా అనుకుంటున్నారు. అయితే.. ఈ కేసు ఎంత వరకు ఎమ్మెల్యేలకు చుట్టుకుంటుంది. అసలు వాళ్లు అరెస్ట్ అయ్యారు అని తెలియగానే.. ఈ లీడర్లు అంతా లాబీయింగులు మొదలుపెట్టి ఉంటారు అనే టాక్ నడుస్తోంది. చూద్దాం.. తొక్కేస్తారా.. తొక్క తీస్తారా అనేది తెలియాలి కదా.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా