newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ..

30-09-202030-09-2020 20:09:03 IST
Updated On 01-10-2020 13:57:52 ISTUpdated On 01-10-20202020-09-30T14:39:03.864Z30-09-2020 2020-09-30T14:38:59.708Z - 2020-10-01T08:27:52.263Z - 01-10-2020

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమది రైతు ప్రభుత్వమేనని చెప్పుకుంటుంది. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా మినహాయింపు కాదు. అలాగే రైతు బంధు, పంటపెట్టుబడి, కోటి ఎకరాల మాగాణి అంటూ రైతు పక్షపాత ప్రభుత్వంగా ముద్ర పడిన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మినహాయింపునకు నోచుకోలేదని స్పష్టమైంది. రైతు కల్లాల నిర్మాణం అంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన తెరాస సర్కార్ తీరా అదును సమయానికి కూడా వాటిని నిర్మించడంలో విఫలమైంది. దీంతో రైతులకు ధాన్యం ఆరబోత కష్టాలు అలాగే మిగిలిపోయాయి. కానీ వాటి నుంచి అన్నదాతను గట్టెక్కించేందుకు కొన్ని మినహాయింపులతోనైనా రోడ్డు పక్కనే ఆరబోసుకోవడానికి అనుమతులు మంజూరు చేసి ఉంటే బాగుండేది. కానీ ప్రభుత్వం ఆ పని కూడా చేయలేదు.

రైతు శ్రేయస్సు, రైతు లబ్ధి అంటూ చాటుతూ గతంలో కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ నిధులతో కల్లాలు ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటన ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రైతులకు ధాన్యం ఆరబోత కష్టాలు ఈ సీజన్ లోనూ తప్పడం లేదు.  స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చినా రాష్ట్రంలో కల్లాల నిర్మాణాలు పూర్తి కాలేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంతో రోడ్డు కిరువైపులా ధాన్యం ఆరబోతను ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే పంట చేతికి వచ్చే సమయం వచ్చేసినా కల్లాలు మాత్రం అందుబాటులోనికి రాలేదు.

ఒక వైపు వర్షాలు..వర్షాకాలం కంటే ముందే వరికోతలు కోయాలన్న లక్ష్యమూ నెరవేరలేదు. అంటే రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న తెరాస  సర్కార్ కూడా అన్నదాత కష్టాలు తీర్చే విషయంలో నత్తనడకనే నడుస్తున్నది. తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమం కోసం, రైతల లబ్ధి కోసం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చి...పంటలు బాగా పండాయి. సోయా, మినుము, పెసర, ధాన్యం ఇలా రాష్ట్రంలో ఏ మూల చూసిన ఇది పంట కోతల సంబర సమయం. ఈ సమయంలో ధాన్యం ఆరోబోత అన్నది రైతులకు పెద్ద సమస్యగా పరిణమించింది. రెండు మూడేళ్లకు ముందు ఆరబోతకు రైతులకు పెద్దగా సమస్యలు ఎదురయ్యేవి కావు.

కానీ ఇప్పుడు హరితహారం తదితర కార్యక్రమాల కారణంగా  ధాన్యం రాశుల ఆరబోత వ్యవహరం ఇబ్బందికరంగా మారింది . రైతు కల్లాలు పూర్తికాకపోవడం,  రోడ్లకు ఇరువైపులా ధాన్యం ఆరబోసే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని గతంలోలా రోడ్ల కిరువైపులా ధాన్యం ఆరబోతకు అవకాశం ఇవ్వాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle