newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

అటు కేంద్రం వ్యవసాయ చట్టం- ఇటు కేసీఆర్ రెవెన్యూ చట్టం- తెలంగాణలో బీజేపీకి కష్టం

25-09-202025-09-2020 20:23:02 IST
Updated On 26-09-2020 10:25:05 ISTUpdated On 26-09-20202020-09-25T14:53:02.533Z25-09-2020 2020-09-25T14:53:00.016Z - 2020-09-26T04:55:05.630Z - 26-09-2020

అటు కేంద్రం వ్యవసాయ చట్టం- ఇటు కేసీఆర్ రెవెన్యూ చట్టం- తెలంగాణలో బీజేపీకి కష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణలో క్షేత్రస్థాయిలో పటిష్టం కావాలని సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీకి అటు కేంద్రంలోని మోడీ సర్కార్, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ కళ్లేలు వేస్తున్నాయా అన్నట్లుగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి దక్షిణాదిన పెద్దగా చెప్పుకోదగ్గ బలం లేని బీజేపీకి కర్నాటక కొద్దిగా ఊతంగా నిలుస్తూ వచ్చింది. ఆ దన్నుతో తెలుగు రాష్ట్రాలలో పాగా వేయడానికి ఆ పార్టీ వేయని ఎత్తులు లేవు. చిన్న రాష్ట్రాలకే మా మద్దతు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి మద్దతు ఇచ్చి తెలంగాణలో బలోపేతం కావాలన్న ఆ పార్టీ ఆశలు కేసీఆర్ వ్యూహాలతో పని చేయలేదు. అటు విభజనకు మద్దతివ్వడంతో ఏపీలోనూ బీజేపీ పుంజుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే 2019 పార్లమెంటు ఎన్నికలలో ఆ పార్టీ రాష్ట్రంలో అనూహ్య విజయాలను అందుకోవడంతో  తెలంగాణలో బలోపేతం కావడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే... రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పులను చేసి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను నియమించింది. త్వరలో గ్రేటర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, దుబ్బాగ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తమ సత్తా చాటేందుకు అంది వచ్చిన అవకాశంగా బీజేపీ భావించింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త రెవెన్యూ చట్టం బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయనే చెప్పాలి. ముందుగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుల విషయానికి వస్తే...రైతు ఆదాయం రెట్టింపు లక్ష్యంలో భాగంగా తీసుకువచ్చిన విప్లవాత్మక బిల్లులుగా కేంద్రం వీటిని అభివర్ణిస్తుంటే..విపక్షాలు రైతును మరింత కుదేలు చేసి కొర్పొరేట్లను బలోపేతం చేస్తాయని విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ బిల్లు వల్ల రైతులకు నష్టమే తప్ప వీసమెత్తు ప్రయోజనం లేదని విమర్శిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రాలకు వ్యవసాయ మార్కెట్ సెస్సు ఆదాయం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక రైతుల విషయానికి వస్తే ఈ బిల్లు వల్ల తమ పంటలకు కనీస మద్దతు ధర లభించే అవకాశం కూడా లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పండించిన పంటను డిమాండ్ వచ్చే వరకూ నిల్వ చేసుకోగలిగిన ఆర్థిక సామర్ధ్యం ఉన్న కామందులకే ప్రయోజనం కలుగుతుందంటున్నారు. రైతు సంఘాల ఆధ్వరంలో నేడు భారత్ బంద్ నిర్వహించారు. 

ఇక కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ చట్టం విషయానికి వస్తే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలనన్నిటినీ చిటికెలో పరిష్కరిస్తందన్న విశ్వాసం రైతంగాంలో కనిపిస్తున్నది. కేంద్ర వ్యవసాయ బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతాంగం రాష్ట్ర రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నది. దీంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. రెవెన్యూ చట్టంపై విమర్శలు చేసినా, కేంద్ర బిల్లులను స్వాగతించినా రైతు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఎదుర్కొనేదెలా అన్న డైలమాలో పడింది.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle