newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు

30-09-202030-09-2020 08:03:17 IST
2020-09-30T02:33:17.394Z30-09-2020 2020-09-30T02:33:10.271Z - - 26-10-2020

స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మళ్లీ నంబర్‌ వన్‌.. హ్యాట్రిక్ రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వచ్ఛభారత్‌ పథకం అమలులో తెలంగాణ మరోసారి దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, జిల్లాల విషయానికి వస్తే కరీంనగర్‌ జిల్లా జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. 

ప్రతి ఏటా స్వచ్ఛ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తోంది. రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తోంది. 

స్వచ్ఛ సుందర్‌ సముదాయిక్‌ సౌచాలయ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌), సముదాయిక్‌ సౌచాలయ అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్‌ భారత్‌ (డీడీడబ్ల్యూఎస్‌) కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.

ఈ మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణను స్వఛ్చభారత్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు గందగీ ముక్త్‌ భారత్‌ డైరెక్టర్‌ యుగల్‌ జోషి తెలిపారు. 

అక్టోబర్‌ 2న స్వచ్ఛభారత్‌ దివస్‌ సందర్భంగా వర్చువల్‌ పద్ధతిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ అవార్డులను అందజేయనున్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి పథకాల వల్లే తెలంగాణ వరుసగా ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంటోందని, ఇందుకుగాను ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. అవార్డు అందుకోవడంలో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 

కాగా, స్వచ్ఛభారత్‌ అవార్డును వరుసగా మూడో సారి దక్కించుకోవడంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.  

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   4 minutes ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   3 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle