newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు తప్పదా?

29-04-202129-04-2021 13:56:38 IST
Updated On 29-04-2021 14:31:47 ISTUpdated On 29-04-20212021-04-29T08:26:38.879Z29-04-2021 2021-04-29T08:21:04.500Z - 2021-04-29T09:01:47.516Z - 29-04-2021

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు తప్పదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రానున్న కొన్ని వారాలలో మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో అన్ని రకాలుగానూ కట్టడి చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరో పక్షం రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మే నెల మధ్య నాటికి తారస్థాయికి చేరుకోవచ్చునని వైద్యులు, నిపుణులు శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ శుక్రవారంతో ముగుస్తుంది. మరో పక్షం రోజులు దీనిని పొడిగించడం వల్ల కోవిడ్ వైరస్ వ్యాప్తిని మరింతగా అరికట్టవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

ఇప్పటికే రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని, దాని తీవ్రతను అధ్యయనం చేసిన ఆరోగ్య విభాగం ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా అందించినట్లుగా చెబు తున్నారు. ఈ నివేదిక ప్రాతిపదికగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకటవ తేదీ నుంచి 18 ఏళ్ళు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలన్న కార్యక్రమంపై ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం దీనిని వేగవంతం చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకు మొత్తం జనాభాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే టీకాలు వేయించుకున్నట్లుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి పూట కర్ఫ్యూను మరో పక్షం రోజులు పొడిగించడంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ విస్తృతంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే అంశంపైనా ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణాలో ప్రభుత్వ చర్యల ఫలితంగా వైరస్ పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పాలి. 

కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మిగతా రాష్ట్రాలతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం చికిత్సకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సకాలంలో కల్పించడమేనని చెబుతున్నారు. అయితే మరో నాలుగు వారాలు పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని ఆరోగ్య డైరెక్టర్ ఇప్పటికే స్ఫష్టం చేసిన నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరగకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ తో పాటు ప్రజల కదలికల పైన కూడా నియంత్రణలు అవసరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే అందుకు అన్ని విధాలుగా ప్రజల సహకారం కూడా తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనుకున్న ఫలితాలు ఇస్తున్నాయంటే ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించి కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని ప్రజలకు అందిస్తూనే ఉన్నారు. నీటిలో ఉన్నవాడికే లోతు తెలుస్తుంది కాబట్టి ఇతర విమర్శలు ఎలా ఉన్నా ప్రభుత్వం తన చర్యలను ముందుకు తీసుకెళ్తే వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తిని కూడా గణనీయంగా అరికట్టే అవకాశం ఉంటుంది.  

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   8 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   8 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   9 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle