newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

19-10-202019-10-2020 11:00:57 IST
Updated On 19-10-2020 11:07:46 ISTUpdated On 19-10-20202020-10-19T05:30:57.417Z19-10-2020 2020-10-19T05:30:54.081Z - 2020-10-19T05:37:46.147Z - 19-10-2020

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దసరా, దీపావళి నేపథ్యంలో వైరస్‌ కట్టడి చర్యలకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట నిర్ణయం తీసుకుంది. కరోనా గురించి పోస్టర్లు, పాటలు, రేడియో జింగిల్స్‌ ద్వారా ప్రచారం చేయాలని తలపెట్టింది దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు విస్తృత ప్రచారం చేపట్టేందుకు సర్కారు సమాయత్తమైంది. 

దీనికోసం సోషల్‌ మీడియా సహా వివిధ రకాల ప్రచార సాధనాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ యాసలో ఆకట్టుకొనే నినాదాలు, ప్రత్యేక పాటలు సిద్ధం చేసింది. అలాగే పండుగల సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

బతుకమ్మను తీసుకెళ్లే మహిళలు మాస్క్‌‌లు ధరించి కరోనాను కట్టడి చేయాలని చెప్పేలా ప్రత్యేక పోస్టర్‌ను అధికారులు విడుదల చేశారు. ‘ఈ పండుగ వేళ శుభ్రతే మన భద్రత’, ‘కరోనాఖేల్‌ ఖతం చేద్దాం.. ప్రతీ ఇంటా సంబురాలు షురూ చేద్దాం’ వంటి నినాదాలను పోస్టర్లపై ముద్రించారు. 

ఇంకో పోస్టర్‌లో ‘మీలో ఎవరు మాస్క్‌ మహారాజు’ అంటూ  తీర్చిదిద్దారు. ‘మాస్క్‌ మహారాజు ఎప్పుడూ సరిగ్గా మాస్క్‌ వేసుకుంటడు’, ‘చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటడు’, ‘గుంపులల్ల దూరడు... ఆరడుగుల దూరం పాటిస్తడు’, ఇవన్నీ మీరు చేస్తుం టే మీరే మాస్క్‌ మహారాజు..అంటూ ఆకట్టుకొనే రీతిలో కార్టూన్లు ప్రదర్శించారు.  

మరో పోస్టర్‌లో ‘కరోనా’సురునిపై సంధించిన 3 బాణాలు చూపిస్తూ ‘కరోనా’సురుడిని అంతమొందించాలని చూపించారు. బతుకమ్మ పాటలతో రేడియో జింగిల్స్‌ను తయారు చేశారు. 

Coronavirus update: Haryana imposes Rs 500 fine for spitting, not wearing  mask

‘పండుగలు ఏటా వస్తాయి కానీ ప్రాణాలు పోతే మాత్రం తిరిగిరావు’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఒక్కసారికి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఆదివారం ఆయన వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. కేరళలో ఓనం పండగ తర్వాత కరోనా కేసులు భారీగా పెరిగిన విషయాన్ని శ్రీనివాసరావు గుర్తు చేశారు. వర్షాలు, వరదల కారణంగా రోగాలు ముసిరే ప్రమాదం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రజలను కోరారు.

ఒక 20 సంవత్సరాల వెనక్కు వెళితే పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పోస్టర్ల ప్రచారం అప్పట్లో సామాన్య జనాలను ఉర్రూలలూగించింది. శృంగారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే పులిరాజుకైనా ఎయిడ్స్ తప్పక వస్తుంది అనే సందేశంతో కూడిన ఆ ప్రచారం దేశవ్యాప్తంగా సంచనలం కలిగించిన విషయం తెలిసిందే. 

ఆరు నెలల తర్వాత కూడా కరోనా వైరస్ అంతరించిపోయే సూచనలు కనిపించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రధానంగా గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని వినూత్న ప్రచారానికి సిద్ధమైంది. 

‘మాస్క్‌ మహారాజు ఎప్పుడూ సరిగ్గా మాస్క్‌ వేసుకుంటడు’, ‘చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటడు’, ‘గుంపులల్ల దూరడు... ఆరడుగుల దూరం పాటిస్తడు’ అంటూ తేలికపదాలతో నేరుగా హృదయాన్ని తాకే భావనతో తెలంగాణ సర్కార్ పండగలపూట ఒకచోట ఎక్కువగా గుమిగూడే ప్రజలకు హితవు పలుకుతూ రూపొందించిన ఈ ప్రకటనలు ఇప్పటికే జనం నోళ్లలో బాగా నానుతున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle