చికెన్-గుడ్డు తింటే బర్డ్ ఫ్లూ రాదంటున్న ప్రభుత్వం.. భయపడుతున్న జనం
13-01-202113-01-2021 07:44:44 IST
2021-01-13T02:14:44.516Z12-01-2021 2021-01-12T15:48:14.095Z - - 20-01-2021

చికెన్-గుడ్డు.. చాలా మంది ఇళ్లలో ఇది సాధారణమైన వంటలు.. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలాయి అనే వార్తలు వచ్చాయి అంటే మాత్రం అందరూ దూరం పెడుతూ ఉంటారు. బాగా ఉడికిస్తే చాలు అని ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కూడా ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతూ ఉండడంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. పలు ప్రాంతాల్లో కోళ్లు మృతి చెందుతుండడంతో ప్రజలు కోడి మాంసం తినడానికి భయపడుతూ ఉన్నారు. పౌల్ట్రీ మార్కెట్ పూర్తిగా నష్టాల బాట పడుతోంది. ప్రజల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. పలు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర రూ.60 రూపాయల కన్నా తక్కువగా ఉంది. మహారాష్ట్రలో కిలో చికెన్ ధర రూ.58, గుజరాత్లో రూ.65, తమిళనాడులో రూ. 70కి పడిపోయింది. తమిళనాడులోని నమక్కల్‌లో ఒక గుడ్డు ధర రూ.4.20కి చేరింది. హర్యానాలో రూ.4.05, పూణెలో రూ. 4.50గా ఉంది. ఇప్పటికి 10 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ పాకినట్టు కేంద్రం వెల్లడించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లోనూ ఫ్లూ కనిపించింది. ఇక రాష్ట్రాలు బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని కూడా అరికట్టాలని కేంద్రం సూచించింది. జలాశయాలు, పౌల్ట్రీ పరిశ్రమలు, జంతుప్రదర్శన శాలల వద్ద నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్ బారినపడిన కోళ్లు, ఇతర పక్షుల సామూహిక వధకు అవసరమైన పీపీఈ కిట్లు, ఇతర ఉపకరణాలు సమకూర్చుకోవాలని కేంద్రం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ పై సమీక్ష నిర్వహించింది. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, పలు శాఖల అధికారులు, పౌల్ట్రీరంగ నిపుణులు పాల్గొన్నారు. మంత్రులు మాట్లాడుతూ చికెన్, కోడిగుడ్లు తింటే బర్డ్ ఫ్లూ రాదని చెప్పారు. ఇలాంటి పుకార్లతో పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా నష్టపోతోందని అన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటి వరకు మనుషులకు ఎలాంటి నష్టం బర్డ్ ఫ్లూ కలిగించలేదని హామీ ఇచ్చారు. బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, సరిహద్దు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్రంలోకి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశమే లేదని చెప్పారు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
3 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
13 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
14 hours ago
ఇంకా