newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

16-04-202116-04-2021 10:20:54 IST
Updated On 16-04-2021 10:35:32 ISTUpdated On 16-04-20212021-04-16T04:50:54.630Z16-04-2021 2021-04-16T04:50:50.600Z - 2021-04-16T05:05:32.346Z - 16-04-2021

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మాజీ మంత్రి, ములుగు మాజీ ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌ గురువారం రాత్రి కరోనా వైరస్ సోకడం వల్ల కన్నుమూశారు. అతనికి కరోనా వైరస్ సంక్రమించడం వల్ల ఆయన మూడురోజుల కిందటే హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. చందూలాల్ ఎన్టీఆర్ హయంలో ట్రైబల్ వెలిఫరే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తరవాత టీడీపీ నుండి తెరాస లో చేరారు. తెలంగాణ ఏర్పడకా మొదటి సరి కేసీఆర్‌ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ మంత్రి వర్గం లో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. 

అజ్మీరా చందూలాల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, తెరాస లీడర్స్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చందూలాల్ 1954లో ఆగస్టు 17న వరంగల్ జిల్లా జగన్నపేట్‌లో జన్మించారు. 1981లో జగ్గన్నపేట్ గ్రామానికి సర్పంచ్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మూడుసార్లు చందూలాల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. చందూలాల్ కి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన పార్దీవ దేహాన్ని స్వగ్రామం తరలించారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత ఎన్నికలలో పోటి చేసిన ఆయన ప్రస్తుత ములుగు ఎమ్మెల్యే సీతక్క చేతిలో ఓటమిపాలయ్యారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle