newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌

30-09-202030-09-2020 11:18:04 IST
2020-09-30T05:48:04.034Z30-09-2020 2020-09-30T05:48:01.863Z - - 25-10-2020

ఉపఎన్నిక నోటిఫికేషన్‌‌తో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 55 అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోకూడా ఉపఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక నియోజకవర్గంపై దృష్టి సారించనున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానుంది.

ఉప ఎన్నికే అయినా.. వెంటనే వరుసగా ఇతర ఎన్నికలు రానుండటంతో ఇక్కడ ఆయా పార్టీలు సాధించే ప్రజాభిమానం భవిష్యత్‌ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తుండగా, రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఈ మూడింటికి మద్దతు తెలిపేందుకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

గత 16 ఏళ్లలో 2014 మినహా దాదాపు అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ శ్రేణులే విజయం సాధించాయి. రామలింగారెడ్డి మృతి పట్ల సానుభూతితో పాటు ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు, సీఎం సొంత జిల్లా కావడం, నియోజకవర్గంపై మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ వెరసి ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలుపు కష్టసాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ గెలుస్తుందా.. లేదా.. అన్న దాని కన్నా ఎన్ని ఓట్లు మెజార్టీ వస్తుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది.  

ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రచారంలో అనధికారికంగా దూసుకుపోతున్న తరుణంలో కాంగ్రెస్‌ కూడా కార్యరంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఇక, ఈ ఉప ఎన్నిక బీజేపీకి కూడా అగ్నిపరీక్షే. ఒకరిద్దరు టికెట్‌ అడుగుతున్నా గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలయిన రఘునందన్‌ రావునే బరిలో దింపాలని కమలనాథులు యోచిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయించినప్పటికీ అక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో ఉండి రెండో స్థానంలో నిలిచారు. ఈ దఫా పోటీకి జాబితాలో కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, నర్సారెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కరణం శ్రీనివాస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేయాలని పార్టీ నేతలు ఢిల్లీకి సమాచారం కూడా పంపారు.

మొత్తంమీద రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు ప్రత్యామ్నాయమన్నది ఈ ఉప ఎన్నిక స్పష్టం చేస్తుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ 3పార్టీలతో పాటు టీజేఎస్, కమ్యూనిస్టులకు కొన్ని ఓట్లున్నా పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. తటస్థంగా ఉండటం.. లేదంటే ఏదైనా పార్టీకి మద్దతు ప్రకటించడం వరకు ఆ పార్టీలు పరిమితమయ్యే అవకాశాలున్నాయి.  

నవంబర్‌ 3న దుబ్బాక ఉపఎన్నిక

దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నిక నవంబర్‌ 3న జరగనుంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటిం చింది.  దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్టోబర్‌ 9న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువును విధించారు.

నవంబర్ 3న పోలింగ్ పూర్తవుతుంది. నవంబర్‌ 10న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే సిద్దిపేట జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తి ఉన్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఈసీఐ ఆదేశించింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle